రొయ్యలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలామంది రొయ్యలను కూరలగాని లేదంటే ఫ్రై లాగా వండుకుంటారు. కానీ ఈసారి వెరైటీగా రొయ్యల పలావ్ చేసి చూడండి.ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు చూడడానికి కూడా బాగుంటుంది.. మరి ఆలస్యం చేయకుండా రొయ్యల పలావ్ కు కావాల్సిన పదార్ధాలు ఏంటో చూద్దామా.. !!

కావలిసిన పదార్ధాలు :

250 gms రొయ్యలు
220 gms బాసుమతి రైస్
1/4 cup నూనె
1 tbsp నెయ్యి
1 ఉల్లిపాయ
4 పచ్చిమిర్చి
2 tbsps కొత్తిమీర
2 tbsps పుదినా తరుగు
1 tbsp అల్లం వెల్లూలి పేస్టు
1 tbsp కారం
1/2 tsp పసుపు
1 tsp గరం మసాలా

తయారీ విధానం:

ముందుగా బాస్మతి రైస్ ను వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి  పసుపు వేసి, ఆ తరువాత పచ్చి రొయ్యలు వేసి మీడియం ఫ్లేం మీద రొయ్యల్లోని నీరు ఇగిరి నూనె పైకి తేలేదాకా వేపుకుని ఓ బౌల్ లోకి తీసుకోండి.ఇప్పుడు అదే మూకుడులో మరో 2 tsp నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేపుకోండి.
ఉల్లిపాయలు సగం పైన వేగాక అప్పుడు పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేపుకోండి.  ఉల్లిపాయలు వేగాక  అల్లం వెల్లులి పేస్ట్ వేసికారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా వేపుకోండి. ఇప్పుడు రొయ్యలు వేసి  మరో 3 నిమిషాలు వేపుకోవాలి.. అందులోనే కొంచెం ధనియాల పొడి,గరం మసాలా వేసి వేపాలి. తరువాత  పొడి పొడిగా ఉడికిన్చుకున్న అన్నం వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీరా, పుదినా తరుగు,  నెయ్యి వేసి బాగా కలిపి దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన రొయ్యల పలావ్ రెడీ అయిపోయినట్లే.. దీన్ని వేడి వేడిగా రైతాతో గాని, పెరుగు చట్నీతో గాని తింటే చాలా బాగుంటుంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: