సాధారణంగా వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారు ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం రాసలీలలు కొనసాగించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ప్రియురాలు ప్రియుడు నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. దీంతో ఇది చూసిన జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏం జరుగుతుందో కాసేపటి వరకు అర్థం కాలేదు. ఈ ఘటన నెల్లూరు లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాల కోటేశ్వరరావు కొన్నాళ్లుగా ఓ మహిళతో అక్రమ సంబంధానికి తెరలేపాడు. ఇక ఎన్నో రోజుల పాటు వీరిద్దరూ అక్రమ సంబంధం లో మునిగితేలారు. కానీ గత కొంత కాలం నుంచి కోటేశ్వరరావు సదరు మహిళను దూరం పెట్టడం మొదలుపెట్టాడు.
అయితే ప్రియుడు దూరం పెట్టడాన్ని ఆ మహిళ సహించలేకపోయింది. ఈ క్రమంలోనే ఏకంగా ఆ డాక్టర్ ఉంటున్న ఆసుపత్రికి వెళ్లి ముఖం మీద నిలదీసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి గొడవ ఎంత వరకు దారితీసిందంటే అందరిముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. కోపంతో సదరు మహిళ ఏకంగా కోటేశ్వరరావును చొక్కా పట్టుకొని నడిరోడ్డు పై కి లాక్కు వచ్చి అందరూ చూస్తుండగానే దారుణంగా దాడి చేసింది. ఇక ఆ సమయంలో డాక్టర్ కోటేశ్వరరావు కూడా మహిళపై దాడి చేశాడు. ఇక వెంటనే స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి