ఇటీవలి కాలంలో వావివరుసలు మరచి పోతున్న మనుషులు క్షణకాల  సుఖం కోసం నీచాతి నీచమైన పనులు చేస్తున్నారు. మానవబంధాలను మరిచి అక్రమ సంబంధాలకు తెరలేపుతున్నారు. ఇలా క్షణకాల సుఖం కోసం మనిషి చేస్తున్న పనులు సభ్యసమాజాన్ని మొత్తం తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఇలా ఎన్నో  ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మాయమాటలతో మహిళలను లొంగదీసుకోవడం.. శారీరక అవసరాలు తీర్చుకోవడం లాంటివి చేస్తున్నారు.


 ఇక వావివరుసలు మరచి ఏకంగా సొంత వాళ్లే ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు ఎంతో మంది యువతులు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకున్న భార్య సరిపోలేదు అన్నట్టు భార్య చెల్లెలిపై కూడా అతని కన్ను పడింది. చివరికి మాయమాటలతో మరదలిని లొంగతీసుకున్న సదరు వ్యక్తి చివరికి  భార్యపై కక్ష తీర్చుకున్నాడు. తల్లి కావాలనే కోరిక ఇక భార్యకు నెరవేరకుండానే చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


 నల్గొండ మండలానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్కు చెందిన మహిళలను వివాహం చేసుకున్నాడు. అయితే వీరికి వివాహం జరిగిన తర్వాత కొన్ని కొద్దిరోజులకే అత్తవారి ఇంటికి వెళ్ళాడు సదరు వ్యక్తి.  ఈ క్రమంలోనే అక్కడ భార్య సోదరితో వివాహేతర సంబంధానికి తెరలేపాడు.. మాయమాటలతో చివరికి మరదలిని లొంగదీసుకోవడం తో ఇక వీరిద్దరూ కలిసి భార్యను ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టారు. చివరికి భార్యకు పిల్లలు కాకుండా చేశాడు సదరు ప్రబుద్ధుడు. ఆ తర్వాత నీకు పిల్లలు పుట్టరు మీ చెల్లిని చేసుకుంటే పిల్లలు కూడా పుడుతారు. ఇక అంతే కాకుండా మీరిద్దరూ ఒకే దగ్గర హాయిగా ఉండొచ్చు అంటూ మాయమాటలతో భార్య ని ఒప్పించాడు. చివరికి మరదలిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఇక మరదలు భర్త కలిసి మొదటి భార్యను హింసించడం మొదలుపెట్టారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: