వెరసి ఒక వైపు మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్న ప్రతి ఆడపిల్ల కామందుల కోరల్లో చిక్కుకోకుండా జాగ్రత్తపడుతూ ప్రతిక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చదువుకోడానికి స్కూల్ కి వెళ్తే ఉద్యోగం చేయడానికి ఆఫీసుకు వెళితే ఇక అన్ని సమస్యలు చెప్పుకోవడానికి.. ఇంటికి వెళితే అక్కడికి వెళ్ళిన ఆడపిల్లలకు మాత్రం వేధింపులు తప్పడం లేదు. పరాయి వాళ్లే కాదు సొంత వాళ్ళు సైతం వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో ఆడపిల్ల జీవితం మరింత దుర్భరంగా మారిపోతుంది.
ఇటీవలే ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ఇటీవలే ఓ యువతి ఆటోలో అత్తతో కలిసి ప్రయాణిస్తుంది. ఈ క్రమం లోనే సదరు యువతి పట్ల ఆకతాయిలు అమానుషం గా ప్రవర్తించారు. యువతిని ఆటోలో నుంచి బయటికి లాగి దారుణం గా వేధించడం గమనార్హం. ఇక ఆ యువతిని రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి బట్టలు మొత్తం చింపేశారు. అంతేకాకుండా దారుణాన్ని మొత్తం వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టాము అంటూ తెలిపారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి