
ఇక మరోవైపు కొంతమంది సిన్సియర్ గా ప్రేమించి ఏకంగా కులమతాలకు అతీతంగా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే చివరికి దారుణ హత్యలకు గురవుతున్నారు. ఇక ఇక్కడ ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల కర్నూలు జిల్లా దొర్నిపాడు లో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన యువతి దక్కలేదు అన్న కారణంతో మనస్థాపం చెందిన యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కని పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చాకరాజు వేముల గ్రామానికి చెందిన జకరయ్య, రత్నమ్మ దంపతులకు ఒక కుమార్తె, కుమారులు ప్రవీణ్ కుమార్, ప్రసన్నకుమార్ ఉన్నారు. అయితే హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇద్దరు కుమారులు కూడా పనిచేస్తున్నారు. కాగా ప్రసన్నకుమార్ అనే 24 ఏళ్ల యువకుడు వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులోని పిన్ని ఇంటికి అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాడు. అక్కడే ఓ యువతితో పరిచయం ఏర్పడి అధి కాస్త ప్రేమగా మారిపోయింది. అయితే యువతిని మర్చిపోవాలంటూ యువకుడిని బెదిరించారు యువతి తల్లిదండ్రులు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రసన్నకుమార్ ఇంట్లో ఎవరు లేని సమయంలో విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిగా చివరకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.