
అయితే గోడ మీద ఉండే బల్లి పొరపాటున మనిషి మీద పడుతుంది అన్న విషయం ఇప్పటివరకు ఎంతోమంది విన్నారు. కానీ బల్లి మనిషిని కరవడం గురించి విన్నారా.. ఒకవేళ కరిస్తే ఏమవుతుంది అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఈ సందేహానికి సమాధానం ఇస్తూ ఓ యువకుడు చేసిన ప్రయోగానికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అందరూ చూస్తుండగానే ఆ కుర్రాడు చెవిని బల్లి కొరికేసింది ఈ ఘటన ఝార్ఖండ్ లోని బొకారో జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సందీప్ జోషి అనే యువకుడు జంతు ప్రేమికుడు.
ప్రధానంగా ఇతను జనాల మధ్యలోకి వచ్చే పాములను పట్టుకుని అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు విషపూరితమైన పాములతో సైతం ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఏకంగా పాములతో కాళ్లు చేతులను కరిపించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరిలో పాముల గురించి అవగాహన తీసుకురావడం చేస్తూ ఉంటాడు. అలా ముఖం చేతులపై తేళ్లను పెట్టుకున్న వీడియోలు కూడా కొన్ని వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు చెవిని బల్లితో కరపించుకున్నాడు. చెవి పోగు లాగా వేలాడుతున్న బల్లి ఎంతోసేపటి వరకు అతని చెవిని కొరుకుతూనే ఉంది. అయితే బల్లి కరిస్తే చాలామంది భయపడతారు కానీ నిజానికి బల్లి కరిచిన ఏమీ కాదు అంటూ సదరు యువకుడు అవగాహన కల్పించాడు.