ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుంది అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అప్పుడు వరకు సంతోషంగా నవ్వుతూ గడిపిన వారు కూడా చూస్తూ చూస్తుండగానే కేవలం క్షణాలు వ్యాధిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు భయాన్ని కలిగిస్తున్నాయ్. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం కళ్ళ ముందు కుప్పకూలి చివరికి క్షణంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణ భయాన్ని కలగజేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. మొన్నటి వరకు ప్రతి ఒక్కరూ  వ్యాయామం చేసి మంచి ఆహారాన్ని తీసుకుంటే.. కాస్త ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉందని అందరూ నమ్మేవారు.


 కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చుసిన తర్వాత మాత్రం ప్రతిరోజు వ్యాయామం చేసిన.. ఎంత మంచి ఆహారం తీసుకున్న ప్రాణాలతో ఉంటాము అనే నమ్మకం మాత్రం ఎవరిలో ఉండడం లేదు.  వెరసి సడెన్ హార్ట్ ఎటాక్లకు సంబంధించిన ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణతీపిని పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక కొంతమంది అయితే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు... ప్రతి రోజు ప్రతిక్షణం అనే ఆస్వాదిస్తూ బ్రతికితే సరిపోతుంది అని అనుకుంటూ సరికొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన అయితే ఇప్పటివరకు కనివిని ఎరుగనిది అని చెప్పాలి. సాధారణంగా ఇప్పటివరకు ఒక వ్యక్తి హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోవడం గురించి విన్నాము. కానీ ఇక్కడ మాత్రం నూతన వధూవరులు ఇద్దరు ఒకే సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. యూపీ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  వధూవరులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా వారి మరణానికి గుండెపోటు కారణమని పోలీసులు తెలిపారు  గోదియా గ్రామానికి చెందిన ప్రతాప్ యాదవ్ పుష్ప యాదవ్ లు మంగళవారం పెళ్లి చేసుకున్నారు   ఇటీవల వారికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి గదిలోకి పంపించారు. కానీ ఉదయం చూసేసరికి విగత జీవులుగా కనిపించారు. దీనిపై అనుమానాలు వ్యక్తం కాగా వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే రూమ్ లో వెంటిలేషన్ లేకపోవడం కారణంగానే వారు మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: