ఢిల్లీ మెట్రో ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. కేవలం ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఎంతో సులభమైన ప్రయాణాన్ని అందించేందుకు అందుబాటులోకి వచ్చిన ఢిల్లీ మెట్రో ఇటీవల కాలంలో చిత్ర విచిత్రమైన ఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది. ఇటీవల కాలంలో ఎంతోమంది సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం ఢిల్లీ మెట్రోలో ఎంతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అది చూసి అందరూ షాక్ అవడం జరుగుతూ ఉంది.


 ఇంకొన్నిసార్లు మహిళలు ఏకంగా ఆర్టీసీ బస్సుల్లో సీట్ కోసం కొట్టుకున్నట్లుగానే అటు ఢిల్లీ మెట్రో లో కూడా కొట్టు కోవడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఇప్పుడు మరొకటి ట్విట్టర్  వేదికగా వెలుగు లోకి వచ్చింది. ఏకంగా ఇద్దరు వ్యక్తులు మెట్రో లో ప్రయాణికులు అందరి మధ్య దారుణంగా కొట్టుకున్నారు. అయితే వారిద్దరిని తోటి ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు అందరూ కూడా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ అటు ఢిల్లీ మెట్రో యాజమాన్యం తెలిపినప్పటికీ కూడా ప్రయాణికుల తీరులో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు. మెట్రోలో ప్రవర్తన సరిగా లేని వారిపై చట్ట నిబంధనల ప్రకారం అవసరమైతే చర్యలు తీసుకునేందుకు కూడా సిబ్బంది సిద్దంగా ఉన్నారు. అయినప్పటికీ ప్రయాణికులు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఇటీవల ఇద్దరు పురుషులు ఏకంగా మెట్రోలో అందరి ముందే ఒకరిని ఒకరు దారుణంగా కొట్టుకునేందుకు సిద్ధమడవడం.. ఇక ఒకరిని ఒకరు వెనక్కి నెట్టుకోవడం లాంటి జరిగింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: