నేటి ఆధునిక సమాజంలో మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయ్. అయితే ఇలా మనిషి జీవన శైలిలో వస్తున్న మార్పులు బంధాలకు బంధుత్వాలకు ఉన్న విలువను తగ్గించేస్తున్నాయా.. అంటే ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎంతోమంది అవును అనే సమాధానం చెబుతున్నారు. ఏకంగా బంధాలకు విలువ ఇవ్వకుండా క్షణకాల సుఖం కోసం మనుషులు చేస్తున్న నీచమైన పనులు.. అందరినీ అవక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే.


 స్నేహితుడు అంటే కష్టంలో తోడుండాలి.. నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలి. సంతోషంలో భాగం కావాలి. కానీ ఇక్కడ ఒక స్నేహితుడు కీచకుడిగా మారిపోయాడు. ఏకంగా స్నేహితుడి భార్యపై కన్నేశాడు. చివరికి ప్రాణ స్నేహితుడు అని నమ్మిన వాడే మోసం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భార్య భర్తను ఫంక్షన్కు పంపించింది. ఇక అతను తిరిగి వచ్చేసరికి ఆమె కనబడలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు భర్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడితే షాకింగ్ విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రశాంత్, తేజస్వినిలు భార్యాభర్తలు.


 వీరిద్దరికి 2020 నవంబర్లో వివాహం జరిగింది. హైదరాబాదులోని రహమత్ నగర్ లో కాపురం ఉంటున్నారు. అయితే ప్రశాంత్ కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. ప్రశాంత్కు కిరణ్ సహా మరి కొంతమంది యువకులతో స్నేహం ఏర్పడింది. స్నేహితులు కావడంతో ప్రశాంత్ ఇంటికి వచ్చి పోతూ ఉండేవారు అందరూ యువకులు. ఈ క్రమంలోనే కిరణ్ ప్రశాంత్ కుటుంబంతో బాగా కలిసిపోయాడు. తేజస్వినినీ అమ్మ అని ఒకసారి అక్క అని మరోసారి వివిధ రకాలుగా సంబోధిస్తూ ఉండేవాడు. అయితే ఈనెల 20వ తేదీన బంధువుల ఫంక్షన్ ఒకటి ఉంది. దానికి వెళ్దామని భార్యను ప్రశాంత్ అడిగాడు. నేను రాలేను నువ్వు వెళ్ళు అని భర్తను పంపించింది తేజస్విని. అయితే భర్తను తయారు చేసి పంపించిన ఆమె భర్త ఇంటికి వచ్చేసరికి మాత్రం కనిపించలేదు. ఇంట్లో బట్టలు ఇతర నగలు కూడా లేవు. ప్రశాంత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కిరణ్ మీదే అనుమానం ఉందని అతనే భార్య పిల్లలను తీసుకెళ్లి ఉంటాడని అనుమానంవ్యక్తం చేశారు ప్రశాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: