ఇలా ఏదో ఒక కారణంతో ప్రేమ అనేది చివరికి ప్రాణాలు పోవడానికి చిరునామా గానే మారిపోయింది అని చెప్పాలి. ఇక అయితే ఇటీవల దక్షిణ ఢిల్లీలో కూడా ప్రేమ అనే ముసుగులో ఓ దారుణ ఘటన జరిగింది. ఏకంగా తన ప్రియురాలిని వేధిస్తున్నాడు అన్న కారడంతో 25 ఏళ్ల యువకుడిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు మైనర్ బాలుడు. ఈ ఘటన కాస్త స్థానికంగా అందరిని ఉలిక్కిపడేలా చేసింది అని చెప్పాలి. అయితే 25 ఏళ్ల వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది.
అయితే ఇలా గాయ పడిన వ్యక్తి బాటి మైన్స్ ప్రాంతానికి చెందిన గంగారాం అలియాస్ సంజయ్గా గుర్తించారు పోలీసులు. అయితే గంగారామ్ ను అతని బంధువులే ఆసుపత్రి లో చేర్పించగా. చివరికి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడం తో ప్రాణాలు కోల్పోయాడు అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే సమీపం లో ఉన్న అటవీ ప్రాంతం లో నిందితుడు పట్టుపడ్డాడు. నిందితుడు మైనర్ బాలుడు అని గుర్తించిన పోలీసులు అతని దగ్గర హత్యకు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు హత్య చేశావు అని ప్రశ్నించగా.. ప్రియురాలని వేధించడంతోనే హత్య చేసినట్లు మైనర్ బాలుడు ఒప్పుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి