
మరి కొంతమంది మాత్రం ఇలా సులభంగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో చేయకూడని నీచమైన పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటారు. ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే కాలనీలో నివసించే ధ్రువ అనురాగ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇటీవల తేదీన ఓ శుభకార్యానికి బంధువుల ఇంటికి వెళ్లారు అయితే మరుసటి రోజు తెల్లవారుజామున వారికి మంగా అనే కేర్ టేకర్ నుంచి ఫోన్ వచ్చింది. మీ ఇంట్లో ఎవరో వ్యక్తి తెల్లటి టోపీ జాకెట్ ధరించి ఉన్నాడు అంటూ తెలిపింది.
దీంతో కంగారుపడిన ఇంటి యజమానులు వెంటనే ఇంటికి వచ్చి చూశారు అయితే ఇక రుద్రాక్షతో కూడిన బంగారు గొలుసు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు యూసుఫ్ గూడా చెక్ పోస్ట్ వద్ద ఒక వ్యక్తి అనుమానితంగా సంచరిస్తున్నాడని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక అతని వద్ద స్క్రూ డ్రైవర్లు, ఒక కట్టర్, గ్రీన్ కలర్ హుడిని స్వాధీనం చేసుకున్నారూ. నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ రాబిన్ హుడ్ గా గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేయాలని అతను ప్రయత్నించినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.