పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఏకాకి లాగా ఒంటరిగా సాగిపోతున్న జీవితానికి పెళ్లి అనే బంధం ఒక తోడు నీడను ఇస్తూ ఉంటుంది. ఇక జీవితాంతం కష్టసుఖాలలో పాలుపంచుకునే ఒక భాగస్వామిని వైవాహిక బంధం అందిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే ఇక యువతీ యువకులు ఇద్దరు కూడా అటు పెళ్లి విషయంలో కోటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. పెళ్లి తర్వాత భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పటి మాట కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి అనేది ఏకంగా ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అని చెప్పాలి.


 మంచి ఉద్యోగం లేదంటే వ్యాపారం చేస్తున్న వరుడు కావాలని అమ్మాయిలు.. ఎక్కువ కట్నం ఇచ్చేఅమ్మాయిలే కావాలని అబ్బాయిలు తెగ కమర్షియల్ గా ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక కొంతమంది అయితే ఏకంగా పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏకంగా ప్రభుత్వం పెళ్లి చేసుకునే వారికి పథకం కింద ఇచ్చే డబ్బుల కోసం ఏకంగా చేయకూడని పని చేసింది. అప్పటికే పెళ్లయిన వివాహిత ఏకంగా సొంత అన్ననే పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది అని చెప్పాలి. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.



 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సామూహిక వివాహాలు చేసుకునే వారికి 35వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఇక ఈ ఆర్థిక సహాయం పైన ఆశపడిన ఒక మహిళ చేయకూడని నీచమైన పని చేసింది. ఏకంగా సొంత సోదరుడనే పెళ్లి చేసుకుంది ఒక వివాహిత. పెళ్లి సమయానికి వరుడుని తెచ్చుకోకపోవడంతో.. మధ్యవర్తులు ఆమె సోదరుడిని రెడీ చేశారు. ఆమె మెడలో తాళి కట్టించారు. అయితే ఆమెకు అప్పటికే పెళ్లి జరిగింది. ఇక ఆ తర్వాత ఈ విషయం తెరమీదకి రావడంతో మహారాజ్ గంజ్ అధికారులు షాక్ లో మునిగిపోయారు. ఇక ఈ విషయం గురించి తెలిసి నేటి సభ్య సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: