ప్రధాని మోడీని చూసి పాకిస్తాన్ నాయకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందట. ఈ మాటలు అంటున్నది ఏ బీజేపీ నాయకుడో కాదు.. సాక్షాత్తూ పాకిస్తాన్ జర్నలిస్టు.. అవును.. కామన్వెల్త్ క్రీడల సందర్భంగా ప్రధాని మోడీ భారత క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తీరు ఆ పాకిస్తాన్ జర్నలిస్టును ఆశ్చర్యపరిచింది. అసలేమైందంటే.. భారత రెజ్లర్‌ పూజ గహ్లోత్‌ మొన్న కొద్దిలో బంగారు పతకం మిస్ అయ్యింది. కాంస్యం మాత్రమే సాధించింది.


అయితే..  బంగారు పతకం సాధించకపోవడంపై పూజా ఆవేదన వ్యక్తం చేసింది. బంగారం గెలవనందుకు తనను క్షమించండని భారత రెజ్లర్‌ పూజ గహ్లోత్‌ వాపోవడం సోషల్ మీడిాయ ద్వారా వాపోయింది. ఆమె ఆవేనద ప్రధాని మోదీని కూడా కదిలించింది. ఆయన పూజా పోస్టుపై స్పందిస్తూ.. ఇది వేడుక చేసుకునే సందర్భమని, బాధపడాల్సిన అవసరం లేదంటూ ప్రోత్సహించారు. పూజా.. మీరు సాధించిన పతకంతో వేడుకలు చేసుకోవాలమ్మా..  క్షమాపణలు చెప్పడం కాదమ్మా.. మీ జీవిత ప్రయాణం మమ్మల్ని ఉత్తేజితుల్ని చేయడంతోపాటు మాకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందన్నారు. పూజా.. మీరు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తారు. ఇలాగే మీ ప్రతిభను కొనసాగించండంటూ ప్రధాని మోదీ ఆమెను ప్రోత్సహించారు.


ఇలా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను దేశ ప్రధానమంత్రి ప్రోత్సహిస్తుండడంపై అందరికీ స్ఫూర్తినిచ్చింది. ప్రధాని మోదీ పోస్టుపై స్పందించిన ఓ పాకిస్థానీ జర్నలిస్ట్‌.. మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. పాకిస్తాన్ దేశ నాయకులకు మాత్రం క్రీడలు, క్రీడాకారుల పట్ల నిబద్ధత లేదంటూ అదే జర్నలిస్టు విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ షిరాజ్‌ హసన్‌ అనే జర్నలిస్ట్‌ ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు.


భారత దేశం తమ క్రీడాకారులను ఎలా ప్రోత్సహిస్తుందో చూడండంటూ సొంత దేశ నేతలకు చురకలు వేశారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి, అధ్యక్షుడి నుంచి ఇలాంటి ప్రోత్సాహకర మాటలు ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. అంతే కాదు.. కనీసం వారికి పాకిస్థాన్‌ అథ్లెట్లు పతకాలు గెలుస్తున్నారనే విషయమైనా తెలుసా.. అంటూ పాక్ నాయకులపై విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: