సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీ గా మార్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు మొండిచేయి చూపించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాడిచర్ల బొగ్గు గనిని కాకతీయ థర్మల్ ప్లాంట్ కు కేంద్రం కేటాయిస్తే ఏఎంఆర్ కంపెనీ కి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రక్రియలో భారీ అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
2020 తర్వాత ప్రభుత్వం ఏ ఓక్క కోల్ బ్లాక్ ను తన ఇష్టారాజ్యంగా ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనాసరే టెండర్ ద్వారానే బొగ్గు గనులు దక్కించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రెండు కోల్ బ్లాకులను సింగరేణి కేంద్రానికి తిరిగి ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నైనీ బ్లాకులో ఎటువంటి తవ్వకాలు సింగరేణి చేపట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో చాలా బొగ్గు కొరత ఉందని దీన్ని అధిగమించాలంటే...ఉత్పత్తి కంపెనీల మధ్య పోటీ తత్వం అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్నారు.
ఈ 8ఏళ్ళలో భాజపా ప్రభుత్వంలో ఓక్క అవినీతి మరక కూడా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదే యూపీఏ హాయాం లో కోకొల్లలుగా కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 2015 కోల్ చట్టాన్ని అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పొగిడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. యూపీఏ హాయాం లో గుజరాత్‌కు ,రాజస్థాన్ కు కేటాయించిన బొగ్గు గనులనే ఇప్పుడు కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. గుజరాత్ తో పాటు తెలంగాణకు కూడా 5 బొగ్గు గనులు కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి