లోకేష్ పాదయాత్రకు 14 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారని ఓ తెలుగు పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. వైసీపీ లో సోషల్ మీడియా కొంత వరకు ఫెయిల్ అవుతోంది. జగన్ పాదయాత్రకు 3 షరతులు మాత్రమే చంద్రబాబు ఇచ్చారని ఆ పత్రిక ప్రచురణ చేసింది.
అప్పట్లో షరతులు మూడు అయినా 17 పేజీల వరకు అవి ఉంటాయని తెలుస్తోంది. దీనికి రఘురాం అనే వ్యక్తితో సైతం సంతకాలు తీసుకుని మరి ఆనాటి టీడీపీ ప్రభుత్వం జగన్ చేయాలనుకున్న పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.


ఇదిలా ఉంటే అప్పుడు ఆ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించింది. ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారన్నది వైసీపీ వాళ్లు చూపిస్తే బాగుండేది. కానీ ఆ పార్టీ సోషల్ మీడియా కాస్త వీక్ గా ఉండటం వల్ల వాటిని ఇవ్వలేకపోతున్నారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. దీంతో అవతల ఉన్న టీడీపీ, దాని అనుబంధ మీడియా చెబుతున్నదే నిజమవుతుంది కదా.. ఇంత చిన్న లాజిక్ ను వైసీపీ వాళ్లు ఎలా మిస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. లేదా టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది అని చెప్పడం లేదు.


మరో కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు హయాంలో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి అవి కాస్త వందల కోట్ల వరకు వచ్చాయని కూడా టీడీపీ దాని అనూకూల మీడియా చెప్పేసింది.ఇఫ్పుడు జగన్ వచ్చాక ఏం రాలేదని టీడీపీ చెబుతోంది.  కానీ అలాంటిదేమీ లేదని వైసీపీ చెప్పుకొస్తుంది.


తాజాగా ఇన్వెస్ట్ ఇండియా వారి లెక్కల ప్రకారం.. 663 మిలియన్ డాలర్ల పెట్టుబడులే ఆంధ్రలో లక్షంగా ఉన్నట్లు తెలుస్తోందని ఎఫ్ డీఏ వారి లెక్కన టాప్ అచీవ్ 2020 అన్నట్లు ఆ ఇన్వెస్ట్ లో తెలిసింది. అసలు ఏమిటీ ఆ నిధులు, దేనికి ఖర్చు చేశారు. వాటిని ఎందుకోసం ఉపయోగించారన్నది, ఏ కంపెనీకి వచ్చాయి అన్నది ప్రభుత్వం ఒక లిస్ట్ బయట పెడితే గాని విషయం తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: