
దాదాపుగా మూడు బిలియన్ల మంది ప్రజలు 150 దేశాల్లో దీనిని వాడుతున్నారు. దాంతో ఇది మోస్ట్ కన్స్యూమ్డ్ ఫ్రూట్ గా మారింది. ఏడాదికి ఒక్కొక్కరు ఎనిమిది కిలోల పామాయిల్ వాడుతున్నట్టు నివేదికలో తేలింది. తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండడం వల్ల 9 మిలియన్ల మెట్రిక్ టన్నుల పామ్ ఆయిల్ ని ఇండియాలో వాడుతున్నారని తెలిసింది. వంట నూనెల వాడకాల్లో పామ్ ఆయిల్ ని ఎక్కువగా అంటే 70% వరకు వాడుతున్నట్టుగా తెలుస్తుంది.
వీటివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి అది కాస్తా గుండె నొప్పికి కారణం అవుతుందని నివేదిక చెప్తుంది. ఈ పామాయిల్ వల్ల ప్రాణాపాయ సమస్యలు వస్తున్నాయని తెలియడంతో ఇప్పటికే మారిషస్ ప్రభుత్వం అక్కడ పామాయిల్ బదులు సబ్సిడీలో సోయాబీన్ లను ఎక్కువగా అమ్మిస్తున్నట్లు తెలుస్తుంది. రైతులను కూడా అక్కడ సోయాబీన్ పంటలు పండించమని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 15 శాతం మంది ప్రజల్లో పామాయిల్ వాడకం వల్ల గుండెల్లో కొవ్వు పేరుకుపోతున్నట్టుగా తెలుస్తుంది.
గ్లైసి డై ఫ్యాటీ యాసిడ్ వల్ల ఈ సమస్య, ఈ అనారోగ్య సమస్య వస్తున్నట్లుగా తెలుస్తుంది. హై టెంపరేచర్ లో దీనిని వాడటం వల్ల ఈ గ్లైసి డై ఫ్యాటీ యాసిడ్ అనేది రిలీజ్ అయ్యే అది గుండె క్యాన్సర్లు వంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ నివేదికలు ఎన్ని చెప్పినా సరే చాలామంది ప్రజలు తర్వాత కూడా పామాయిల్ వాడుతూనే ఉంటారు.