
తప్పో ఒప్పో లోకేష్ ని తనకి తానుగా ఎదగనివ్వాలి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణ అంతా చూసుకోవలసిన నారా లోకేష్ ఇంకా పదును తేలాలి. గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగైన లోకేష్, భవిష్యత్తులో ఇంకా మెరుగవ్వాలి. అప్పుడే తెలుగుదేశం పార్టీ మనుగడపై ఆధారపడ్డ పారిశ్రామికవేత్తలు, ఇంకా కొంతమంది పెద్దలు, తెలుగుదేశం అండతో బ్రతుకుతున్న నాయకులు వీళ్ళందరికీ ఒక ఆశావాదం కల్పించిన వాడు అవుతాడు. మంగళగిరిలో ఓటమి పాలైనా ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పాదయాత్ర అని మరొకటి అని ప్రజల్లోకి ముందుకు వెళ్ళిపోతున్నాడు.
కానీ లోకేష్ కూడా తన తండ్రి చంద్రబాబు నాయుడు లాగే ప్రజాదరణ ఇంకా పొందాలి. కానీ లోకేష్ జనాల ముందుకు వెళ్ళినప్పుడు, లోకేష్ మీటింగులకు జనాదరణ సరిగ్గా ఉండకపోవడంతో, తన తండ్రి చంద్రబాబు నాయుడు కి వచ్చిన జనం లోకేష్ కి రాకపోవడంతో మీడియాలో కూడా ప్రత్యేకించి న్యూస్ పేపర్స్ లో తన తండ్రి లాగా సరిగ్గా ఫోకస్ అవ్వడం లేదు. ఈనాడు, జ్యోతి లాంటి పత్రికలు కూడా సరిగ్గా ప్రాజెక్టు చేయలేకపోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన వారసుడి రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డం వస్తాడో అని ఆయనకు చెక్ చెప్తూ పవన్ కళ్యాణ్ ని తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ని కూడా పాలిటిక్స్ లో అంతటి, తనంతటి స్టార్ ని చేయాలి.