సపోజ్ ఒక విఐపి ఒకచోటికి రావాలంటే ఏ రూట్ లోంచి రావాలి, ఏ రూట్ లోంచి వస్తే త్వరగా వస్తారు, ఇంకా ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఇలాంటివన్నీ కూడా ఈ లాజిస్టిక్స్ లోకి వస్తాయి. ఈ లాజిస్టిక్స్ అనేవి ఇప్పుడేదో అఫీషియల్ గా వెడ్డింగ్ మేనేజ్మెంట్ అని, వెడ్డింగ్ ప్లానర్స్ అని ఇలా పిలుస్తున్నారు. ఇది ఎక్కడో ఫారిన్ నుంచి వచ్చిన పద్ధతి ఏమీ కాదు.
ఇది మన భారతీయులలోనే వంశపారపర్యంగా, అంటే ఇంకా చెప్పాలంటే మన తల్లుల నుండి, తండ్రుల నుండి వాళ్ళ కుటుంబ నిర్వహణ నిమిత్తం వేసే ప్లాన్స్ నుండి వచ్చిందే. అంటే ఇది మన పాత పద్ధతే కానీ కొత్త పేరుతో పిలుస్తున్నారు అంతే, ఒక వృత్తిలా. గతంలో మన ఆడవాళ్ళలో తల్లులుగానీ, నానమ్మలు, అమ్మమ్మలు గాని ఎవరైనా సరే అప్పుడు కుటుంబాలు పెద్దవి ఉండేవి కాబట్టి వాళ్లకి భోజనం ఎంత వండాలి, ఎవరెవరు, ఎంతెంత తింటారు, ఎవరెవరు ఏమి తినరు అనేదాన్ని బట్టి లెక్క వేసి మరీ వండేవారు.
ఆ రకంగా దుర్వినియోగం కాకుండా చేసి ఖర్చుని అదుపు చేసేవారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లాజిస్టిక్స్ లో, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ లో భారత్ 38వ స్థానాన్ని గెలిచిందని, మేకిన్ ఇండియా ఆత్మ నిర్భర్ లో ఇది ఒక భాగమని చెప్తున్నారు. పాల్గొన్న 138దేశాల్లో భారత్ 38వ ర్యాంకులోకి రావడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి