
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైంది. తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70% పెరిగిందని ఆ సర్వేలో పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు.. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసింది. దీంతోపాటు, 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,275 భృహత్ పల్లె ప్రకృతి వనాలను కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసింది. రహదారులకు ఇరువైపులా మొక్కలను పెద్ద సంఖ్యలో కేసీఆర్ సర్కారు పెంచింది. అంతే కాదు.. పట్టణాలో 700 కోట్ల రూపాయల వ్యయంతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్ లను కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసింది.
అలాగే తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరిత నిధిని కూడా ఏర్పాటు చేసింది. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ హరిత నిధిలో భాగస్వాములయ్యేలా చూస్తోంది. ఇలా సేకరించిన మొత్తంలో హరిత నిధికి నోడల్ ఏజన్సీ గా అటవీ శాఖ వ్యవహరిస్తోంది. ఈ నిధితో సుమారు ఒక లక్ష కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా రహదారి వనాలను కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసింది. ఫలితంగా 13.44 లక్షల ఎకరాల క్షీణించిన అడవులను పునరుద్ధరించారు.
అందుకే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ హరితోత్సవాన్ని కేసీఆర్ సర్కారు నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ గ్రామాలు, పట్టణాల్లో ఈ తొమ్మిదోవ విడత హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతారు. ఈ తొమ్మిదో విడతలో భాగంగా 19.29 కోట్ల మొక్కలను నాటాలని కేసీఆర్ సర్కారు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈఏడాది అన్నీ సాగునీటి ప్రాజెక్టుల స్థలాల, కాలువల వెంట పచ్చదనం పెంచాలని కేసీఆర్ సర్కారు ప్రభుత్వం నిర్ణయించింది.