అలాంటి పార్టీ కి ఇప్పుడు బయటి నుంచి కుట్రలు మొదలయ్యాయి. ఒకేసారి ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. అందులో ముఖ్యమైనవి చంద్రబాబుని జైలుకి పంపిచడం. ఆయన్ను శాశ్వతంగా జైల్లో ఉంచేందుకు వైఎస్ జగన్ వరుసగా కేసుల మీద కేసుల పెడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో పాటు గా పార్టీ ముఖ్య నేతలపై కూడా ఏదో ఒక కేసు పెట్టి వాళ్లని కదలనీయకుండా, ప్రతిఘటింకుండా చేస్తున్నారు.
పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఏదైనా కార్యక్రమం ఉదా.. యువగళం, బాబు ష్యూరిటీ వంటి వాటిని చేపడితే దానిని దెబ్బతీసేలా ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారు. వీటన్నింటిని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడం. తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని భావించిన కేసీఆర్ అందులో విజయవంతమయ్యారు. ఈ సారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ ఎంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందో.
మూడోది బీజేపీ. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆపార్టీ వెన్నంటే ఉన్నారు. అలాంటి వారి ఓటు బ్యాంకుకు గండికొట్టింది కాషాయ దళం. బీసీ సీఎం ని ప్రకటించి కొంతమంది బీసీలను తమవైపు తిప్పుకోగలిగింది. మరోవైపు మాదిగల వర్గీకరణ తో కూడా టీడీపీని దెబ్బకొడుతోంది. టీడీపీ సైద్ధాంతిక అంశాలు, సామాజిక అంశాలపై కూడా ప్రభావం చూపుతోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమంచడం లాంటివి చేస్తూ టీడీపీని ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయి. చంద్రబాబు అపర చాణక్యుడు అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. వీటన్నింటిని ఎదుర్కొని ఆయన ఎలా బయటపడతారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి