
మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు పై సర్వత్ర ఆసక్తి రేగుతుంది. పార్టీ నాయకులు దాదాపు ఇప్పటికే అనేక మార్గాల ద్వారా మహానాడు వేదిక వద్దకు చేరుకుంటున్నారు. మంగళవారం - బుధవారం గురువారం మూడు రోజులపాటు నిర్వహించే మహానాడు పార్టీకి దశా దిశా చూపించడమే కాకుండా యువతకు కూడా పెద్ద పీఠ వేయనుంది. మరి ముఖ్యంగా ఈసారి మహిళలు కు మరింత దన్నుగా పార్టీ మారింది. ఈ క్రమంలోనే గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈసారి ఏకంగా 14 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. నిజానికి మహానాడు అంటే 7 లేదా 8 తీర్మానాల వరకే పరిమితం అయ్యేది. ఈసారి మాత్రం 14 తీర్మానాలను ప్రతిపాదించారు. దీనిని బట్టి పార్టీ భవిష్యత్తును ఊహించుకోవచ్చు అని తీర్మానాల కమిటీ చైర్మన్గా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. అంటే పార్టీని వచ్చే 30 నుంచి 40 ఏళ్ళ పొట్టు పదిలంగా కాపాడుకునే కార్యక్రమానికి తాజా మహానాడులో బీజం పడనుంది.
ఈ సారి యువతకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు తీర్మానం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి కొమ్ముకాసే యువతకు పదవులు ప్రాధాన్యాలను పెంచనున్నారు. ఇది పార్టీకి మేలు మెరుపుగా మారింది గుజరాత్ తరహాలో ఒకే పార్టీ లేదా కూటమి ఎక్కువ కాలం అధికారంలో ఉంటే కలిగే ప్రయోజనాలను కూడా ఈ మహానాడులో వివరించనన్నారు. దీనిపై మరో తీర్మానం కూడా చేయనున్నారు. వైసీపీ అరాచకాలను ప్రధానంగా చర్చించేందుకు ఏకంగా మూడు నుంచి నాలుగు గంటలు సమయం కేటాయించనున్నారు. ఓవరాల్ గా ఈ 14 తీర్మానాలతో పాటు మరో ఆరు కీలక అంశాలను కూడా ప్రకటించ నున్నారు. ఇవన్నీ పూర్తిగా నారా లోకేష్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నవే అని మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. వీటిని టిడిపి సూపర్ సిక్స్ గా ఆయన అభివర్ణించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు