- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఏడాది పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. అయితే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ఏడాది తమకు హనీమూన్ పీరియడ్ అనుకోలేదు. వారు ప్రమాణ స్వీకారం చేసిన నటించే పనులు ప్రారంభించారు.. ప్రజల మధ్యకు వచ్చారు. తొలి రోజు నుంచే ప్రక్క ప్రణాళికలతో ప్రభుత్వ పాలన ప్రారంభించారు. తొలి వారంలోనే సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనులు ఎక్కడ ఆగాయో తెలుసుకున్నారు. అమరావతి లోను పర్యటించి రాజధాని పనులు వేగవంతం అయ్యేలా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తొలి వారంలోనే తన శాఖలలో యాక్షన్ మొదలుపెట్టారు. ఇలా తొలి ఏడాది సీఎం, డిప్యూటీ సీఎం విషయంలో హనీమూన్ పీరియడ్ లేదని చెప్పాలి. కానీ ఎమ్మెల్యేల విషయానికొస్తే తేడా కొడుతుంది.


ఏడాది కాలంలో ఎవరు ఏం చేశారు ? అంటే కొందరు తమకు నిధులు లేవని అందుకే ప్రజల మధ్యకు రాలేకపోతున్నామని చెబుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ వారే ఆలోచించుకోవాలి. చాలామంది ఎమ్మెల్యేలు తాము ప్రజలకు ఏం చేశాం ? ప్రజల సమస్యలు ఎంతవరకు పరిష్కరించాం అన్నది పక్కన పెట్టేసి దోపిడీ అవినీతి అక్రమాలకు తెరలేపారు. తొలి ఏడాదిలోనే దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తోంది. మరో నాలుగేళ్ల పాటు వారు ప్రజల మధ్య ఉండాలి.. ఇప్పుడే ఇంత వ్యతిరేకత ఉంది అంటే ఈ నాలుగేళ్లలో వ్యతిరేకత ఇంకెంత తీవ్రమవుతుందో అన్న చర్చలు కూడా ఆయా నియోజకవర్గాలలో వినిపిస్తున్నాయి.


ఈ ఎమ్మెల్యేలు అందరూ ప్రజల సమస్యలు పరిష్కారానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించలేకపోయారని చెప్పాలి. ఏది ఏమైనా ఇప్పుడు కూటమిలో ప్రతి ఒక్క నాయకుడు హనీమూన్ పీరియడ్ ముగిసింది. రెండో ఏడాది అత్యంత కీలకం. మరి ఎప్పటికైనా వీళ్లు సరైన కార్యాచరణ ఏర్పాటు చేసుకునే ముందుకు సాగుతారో లేదో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: