ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనతో పాటు ఆయన కుమార్తెల రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు చర్చ మొదలైంది. “ నిప్పులేనిదే పొగ రాదు ” అన్నట్లు, ఇటీవల సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, రాబోయే ఎన్నికల్లో జగన్ కుమార్తెల్లో ఒకరు రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చని టాక్ నడుస్తోంది. కడపలో ఎంపీ వైఎస్‌. అవినాష్ రెడ్డికి బదులుగా వైఎస్ కుటుంబ సభ్యురాలు పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. వైఎస్. జ‌గ‌న్‌ కుమార్తెల గురించి ఇప్పటివరకు బయటకు పెద్దగా సమాచారం రాలేదు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. చదువులు పూర్తి చేసిన తర్వాత లండన్‌లోనే స్థిరపడిన వారు, కేవలం కుటుంబ కార్యక్రమాలు లేదా ముఖ్య సందర్భాల్లో మాత్రమే భారత్‌కు వస్తారు. ఈ సారి జగన్ కుటుంబం పదిహేను రోజుల పాటు యూరప్ పర్యటనలో ఉంది. దీంతో ఈ ప్రయాణం వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నాయా ? అన్న అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


ఇక వైఎస్ వారసత్వం గురించి మాట్లాడుకుంటే, జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇప్పటికే తన కుమారుడు రాజా రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. రాజారెడ్డిని త‌న‌ రాజకీయ పర్యటనల్లో చురుకుగా పాల్గొనేటట్లు చేస్తూ, రాజకీయ వారసుడిగా పరిచయం చేసే ఆలోచ‌న‌ల్లో ఆమె ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ కుటుంబ వారసత్వం గురించి మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో జగన్ కూడా తన కుమార్తెలను రాజకీయంగా ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నారన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన ప్రత్యక్షంగా స్పందించకపోయినా, వైఎస్ రాజకీయ వారసత్వం కొనసాగాలని ఆయన కోరుకుంటారని వైసీపీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది. అందుకే భవిష్యత్తులో జ‌గ‌న్ ఇద్ద‌రు కుమార్తెల్లో ఒకరు ఆ బాధ్యత తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తం మీద, జగన్ లండన్ పర్యటనతో వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వ చర్చ మళ్లీ వేడెక్కింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: