
ఇప్పటివరకు అల్లు అర్జున్ అభిమానులు కూడా మెగా అభిమానులతో కలిసి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే గత కొన్నేళ్లుగా మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ సినిమాలతో పాటు , అల్లు అర్జున్ ని చాలాసార్లు ట్రోల్ చేయడమే కాకుండా నెగటివ్ ప్రచారం కూడా చేస్తున్నారని అల్లు అర్జున్ అభిమానులు ఎన్నోసార్లు తెలియజేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా తమకు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండాలి అంటూ డిమాండ్ చేశారు. అందుకే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారికంగా కమిటీ సభ్యులను కూడా ఎంచుకున్నట్లు వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తనకు అండగా అభిమానులు లేరని చెప్పవచ్చు. అందుకే ఆ సమయంలో అల్లు అర్జున్ కు అభిమానుల సంఘం అవసరం ఉందని గ్రహించారని, అందుకే పెద్ద సంఖ్యలో అనుచరులతో పాటు, టీమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నట్లుగా అల్లు అర్జున్ తన సన్నిహితులతో చెప్పినట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని విషయాలను ప్రజలకు చెప్పాల్సిన సమయంలో సమర్థవంతంగా తీసుకువెళ్లేవారు లేకపోవడంతో చాలా సార్లు అల్లు అర్జున్ ట్రోల్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.
దీంతో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ ఒక పోస్ట్ వైరల్ గా మారింది. దీని ద్వారా అల్లు అర్జున్ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను మొదలుపెట్టడమే కాకుండా తమను అభిమానించే వారి కుటుంబాలకు కూడా తన వంతు సహాయం చేసేలా ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండబోతున్నట్లు వినిపిస్తున్నాయి. దీని ద్వారా సహాయం అడిగిన వారందరికీ కూడా చేసేలా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి.