
సినిమా షూటింగ్ దశలోనే ఉన్నప్పటికీ, ట్రేడ్ సర్కిల్స్‌లో దీని బిజినెస్ ఫిగర్స్ దుమ్మురేపుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. సమాచారం ప్రకారం, కేవలం థియేట్రికల్ రైట్స్‌కే రు. 100 కోట్లకు పైగా ఆఫర్లు వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇది చిరంజీవి మార్కెట్ ఇంకా ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. సినిమాలో అనేక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి పాత్రలోని హాస్యభరితమైన షేడ్స్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉండనున్నాయని సమాచారం. అదేవిధంగా సినిమాలో ప్రముఖ నటులు, నటీమణులు కూడా గెస్ట్ అప్పియరెన్స్‌లు ఇవ్వబోతున్నారని టాక్.
అనిల్ రావిపూడి సంతకం అయిన మాస్ ఎంటర్టైన్మెంట్‌కి తోడు ఫ్యామిలీ ఎమోషన్‌లను కలిపి ఈ సినిమాను పూర్తి ఫెస్టివల్ ట్రీట్‌గా మలచనున్నాడట. సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అవ్వబోతున్న ఈ చిత్రం, ఆ సమయంలో వచ్చే పెద్ద సినిమాల మధ్య గట్టి పోటీ ఇవ్వనుంది. మొత్తానికి “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాతో మెగాస్టార్ మళ్లీ తన క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ స్టైల్‌లో మెరిసే అవకాశం ఉందని ఫ్యాన్స్ భారీగా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. సంక్రాంతి బరిలో ఈ చిత్రం గట్టి కాంపిటేషన్ ఇస్తుందనే నమ్మకం బలపడుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.