ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో  8వ తరగతి చదువుతున్న మొత్తం 4,59,564 మంది విద్యార్థులకు ఇంకా 59,176 టీచర్లకు ఏకంగా 5,18,740 ట్యాబ్‌ల పంపిణీని ముఖ్యమంత్రి జగన్ బుధవారం నాడు ప్రారంభించారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో అందించనున్న ఈ ట్యాబ్‌ల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఏకంగా రూ.1,466 కోట్ల ఖర్చు చేసినట్లు స్థానిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 2019 వ సంవత్సరం నుంచి పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణల హోస్ట్‌లో భాగంగా ఈ టాబ్లెట్‌లను పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు.ఈ అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి ఏకంగా రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుందన్నారు సీఎం జగన్.


ఈ స్కీం ద్వారా మొత్తం 45 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరగా అమ్మఒడి పథకం కోసం రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటి దాకా ఏకంగా రూ.19,617.6 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు జగన్.ఇంటర్నెట్‌  లేకపోయినా కూడా ఆఫ్‌లైన్‌లో  ఈ ట్యాబులు ద్వారా పాఠాలు వినే అవకాశం ఉంటుందన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇంకా అలాగే ఈ ట్యాబులుకు మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంటుందన్నారు. మనం ఇచ్చే టెక్నాలజీ వల్ల పిల్లలకు మంచి జరగాలి తప్ప చెడు జరక్కూడదని అన్నారు. ఇక ఇదే ఆలోచనతో ఎండీఎం సాఫ్ట్‌వేర్‌ పెట్టారని జగన్ చెప్పారు. ట్యాబుల్లో పాఠాలు ఇంకా లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.6వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ ప్రతి క్లాసులో కూడా డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ సిద్ధం చేయబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి పై తరగతి దాకా ప్రతి సెక్షన్‌లో కూడా డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ అవ్వబోతున్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: