హైదరాబాద్‌లో బుధవారం మార్కెట్ లో ధర పెరిగింది..
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,680గా ఉంది.బుధవారం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు పైకి కదిలాయి. హైదరాబాద్‌లో మాత్రం భారీగా పెరిగింది.బంగారం ధరలు పెరిగితే.. వెండి కూడా భారీగా పెరిగింది. దాదాపు500 పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,300కు చేరింది
బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. బంగారం ధరలు నిలకడ గా మాత్రం లేదు. కరొనా కారణం గా రోజు రోజు పైకి కదులుతోంది. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ ధర ను చూసి వెల్లాలని అంటున్నారు. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. పెళ్ళిళ్ళు సీజన్ కావడం తో ధరలు కొద్దిగా పెరుగుతున్నాయి.. జూన్ లో అయిన ధరలు కిందకు వస్తాయో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి