ఇటీవల కాలంలో బరువు పెరగడం అనేది ఒక్కరి సమస్య కాదు ప్రతి ఒక్కరి సమస్యగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో జీవనశైలి అలాంటిది. ఒకప్పుడు శరీరానికి పని చెప్పి.. మైండ్ ని కూల్ గా ఉంచేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం మైండ్కు పని చెప్పి శరీరాన్ని కదలకుండా ఒకే చోట ఉంచుతున్నారు. వెరసి ఇక ఎంతోమంది ఇక బరువు పెరిగిపోతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందె. అదే సమయంలో నేటి రోజుల్లో ఇంట్లో ఉండే ఆహారాన్ని కాదని ఇక పీజ్జాలు బర్గర్లు అంటూ ఎన్నోహోటల్ ఫుడ్స్ కి అలవాటు పడుతున్నారు.


 ఇలాంటివి తినడం వల్ల ఎంతోమందిలో తెలియకుండానే బరువు పెరిగిపోవడం ఇక లావు ఎక్కువ కావడం లాంటిది జరుగుతూ ఉంది. అయితే కొంతమంది ఇలా బరువు పెరిగినా కూడా పట్టించుకోవడం లేదు. మరి కొంతమంది కాస్త బరువు పెరిగితే చాలు ఏదో ఒకటి చేసి బరువు తగ్గించుకోవాలని భావిస్తూ ఉన్నారు. అయితే జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తే బరువు తగ్గడానికి చాలా కష్టపడాలి. అలా కాకుండా సులభంగా బరువు తగ్గడం ఎలా అని ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక ఇలా బరువు పెరిగిపోయిన వారిలో కొంతమంది ఏకంగా వందలకిలోల బరువు ఉన్న వారిని కూడా చూస్తూ ఉంటాం.


 అచ్చం ఇలాగే ఏకంగా 240 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఇక రోజువారి పనులు చేసుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతని ఇబ్బందులను తీర్చారు డాక్టర్లు. ఏకంగా అరుదైన ఆపరేషన్ చేసి రెండు నెలల్లోనే 70 కేజీల బరువును తగ్గించారు. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఈ అరుదైన ఆపరేషన్ చేశారు. రెండు నెలల క్రితం 240 కిలోలు ఉన్న వ్యక్తికి బెరీయార్ట్రిక్ సర్జరీ చేసి 70 కిలోలు తగ్గించారు. ఇక ప్రస్తుతానికి బరువు 170 కిలోలు ఉంది. అయితే మరో 80 నుంచి 90 కిలోలు తగ్గే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా పొట్ట పరిమాణం తగ్గించడంతోపాటు ఇక ఆహారం ఎక్కువగా పట్టకుండా చిన్న పేగును కూడా కాస్త తగ్గించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: