శరీరం ఫిట్ గా ఉండి కండలు పెరగాలంటే, జిమ్ లో కష్టపడితే సరిపోదు.సరైన ఆహారం తీసుకోవాలి.ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. జిమ్ కి వెళితే కొవ్వు కరుగుతుంది. అంతేకానీ కండలు పెరగవు కండలు పెరగాలంటే శరీరానికి అవసరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

 కండలు పెరగాలంటే చికెన్ తినడం మంచిది. చికెన్ తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. చికెన్ లో సుమారుగా అన్ని రకాల ప్రొటీన్స్ ఉంటాయి.కండలకు కావలసిన బలాన్ని చికెన్ అందిస్తుంది. స్కిన్ లెస్ చికెన్ మాత్రమే తినాలి.

 పాలకూర తీసుకోవడం వల్ల కండలు పెరుగుతాయి. ఎందుకంటే పాలకూరలో క్యాల్షియం, ఐరన్,విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె,విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. వీటివల్ల ఎముకలు బలంగా ఉంటాయి.ఇందులో గ్లూటమిన్, ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల కండలు పెరగడానికి బాగా సహాయపడుతుంది.

 ఓట్ మీల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్,క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. ఇవి కండలు పెరగడానికి సహాయ పడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ను,బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచుతుంది.ఇంకా కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి.

 వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడం చాలా మంచిది. వర్కౌట్ కొన్ని గంటల ముంద బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఎనర్జీ తో వర్క్ అవుట్ చేస్తారు.ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అలాగే కండరాలు పెరగడానికి సహాయపడుతుంది.

గుడ్డులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది.ఇంకా విటమిన్ డి,అమినో యాసిడ్స్ ఉంటాయి ఇవి కండలు పెరగడానికి సహాయపడతాయి. కాబట్టి రోజు గుడ్డు తీసుకోవడం చాలా మంచిది.

 జిమ్ కి వెళ్లి ఎక్కువ సమయం వర్కవుట్లు చేయడానికి బీట్ రూట్ చాలా ఉపయోగపడుతుంది.బీట్ రూటు బ్లడ్ సర్క్యులేషన్ ను బాగా పెంచుతుంది..                                                                                                                                                                                                                                                                                                                                                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: