ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... నెయ్యి అన్నంలో తింటే ఎంత రుచిగా ఉంటుందో.. అంతే ఆరోగ్యం కూడా హెల్త్ కి. ఇక నెయ్యి వల్ల షుగర్ వ్యాధితో పాటు ఇంకా మరెన్నో సమస్యలు తగ్గుతాయి. అవేంటో తెలుసుకోండి...డయాబెటిక్ పేషెంట్స్ రైస్, గోధుమ పిండి తో చేసిన చపాతీ తినడం అంత ఆరోగ్యకరం కాదు, ఎందుకంటే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. చపాతీల మీద నెయ్యి రాయడం, అన్నం లో నెయ్యి కలుపుకోవడం వల్ల వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, తేలికగా అరుగుతాయి కూడా.నెయ్యిలో ఎస్సెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి ఫ్యాట్ సెల్స్ ని కుంగిపోయేలా చేస్తాయి. నెయ్యిలో ఉండే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వలన బాడీ ఫ్యాట్ కరుగుతుంది. మీ ఆహారంలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవడం అలవాటు చేసుకోండి.


అరుగుదల బావుంటుంది, బరువూ తగ్గుతారు.జలుబు, ముక్కు దిబ్బడ చిరాకు పెట్టే సమస్యలు. ఆపకుండా తుమ్ములు రావడమే కాదు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. తలనొప్పితో పాటూ నోరు అరుచిగా మారుతుంది. ఈ సమస్యకి చక్కని పరిష్కారం పరగడుపున ముక్కు రంధ్రాల్లో కొన్ని చుక్కలు వెచ్చని శుద్ధమైన నెయ్యి వేయడమే. ఇందువల్ల ఇన్స్టెంట్ గా రిలీఫ్ లభిస్తుంది. నెయ్యి గోరు వెచ్చగా మాత్రమే ఉండాలని మర్చిపోకండి.రాత్రి నిద్రకి ముందు ఒక కప్పు వేడి పాలలో ఒకటి రెండు టీస్పూన్ల నెయ్యి వేసుకుని తీసుకోండి. ఇందువల్ల కాన్స్టిపేషన్ సమస్య దూరమవుతుంది.


ఇంటెస్టైనల్ వాల్స్ హెల్త్ ని నెయ్యి సపోర్ట్ చేస్తుంది. డైజెస్టివ్ ఫైర్ ని నెయ్యి ఇంక్రీజ్ చేస్తుంది.డైజెస్టివ్ సిస్టమ్ కి హెల్ప్ చేయడం, ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేయడం, ఎస్సెన్షియల్ విటమిన్స్ ని ప్రొవైడ్ చేయడం, యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ ని కలిగి ఉండడం, జుట్టునీ చర్మాన్నీ హెల్దీగా ఉంచడం వంటి ఎన్నో సుగుణాలు నెయ్యిలో ఉన్నాయి.పాల నుండి వచ్చే ఈ నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, బ్యుటిరిక్ యాసిడ్, ఇంకా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అందుకే మీ రోజు వారి జీవితంలో నెయ్యిని ఉపయోగించండి. సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉండండి....

మరింత సమాచారం తెలుసుకోండి: