మన పూర్వీకుల నుంచి పుదీనా వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది రుచికి రుచి సువాసన కూడా కలిగి ఉంటుంది.. పుదిన వివిధ వ్యాధులను కూడా నయం చేయడానికి వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనా ఆకులు వేడి వాతావరణం లో కూడా శరీరాన్ని చాలా చల్లగా ఉంచేలా చేస్తుంది. పుదీనా ఆకులను నమ్మడం వల్ల కూడా నోటిలో ఉండేటువంటి దుర్వాసనను కూడా తొలగించేలా చేస్తుంది. అంతేకాకుండా దంతాలకు కూడా మేలు చేస్తుందని చెప్పవచ్చు. మరి పుదీనా వల్ల మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.


పుదీనా ఆకు రసం నొప్పి నివారణగా పనిచేస్తుంది. ఏదైనా సందర్భంలో తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా టీ తాగడం లేదా ఆకులను నమ్మలడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనా ఆకుల పేస్ట్ కీళ్ల నొప్పిలను కూడా తగ్గిస్తుంది.. పుదీనా ఆకులలో ఉండేటువంటి అమ్మినోయాసిడ్, పొటాషియం ,జింక్ వంటివి చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచేలా చేస్తాయి. పుదీనా ప్యాక్ వల్ల చర్మం మీద మొటిమలు కూడా తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. జలుబు దగ్గుతో ఇబ్బంది పడేవారు పుదీనా ఆకులను తినడం చాలా మంచిది.


పుదీనా ఆకులను మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా దుర్వాసన కూడా తగ్గిపోతుంది. అలాగే దురదను కూడా తగ్గించడానికి ఈ పుదీనా చాలా సహాయపడుతుంది. జీర్ణ క్రియను బలోపేతం చేయడానికి కూడా పుదీనా సహాయపడుతుంది. జుట్టు రాలిపోతుంటే రెండు మూడు రోజులపాటు పుదీనా ఆకులను బాగా నూరి తలకు పట్టించడం వల్ల జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఏదైనా గాయాలు అయినప్పుడు లేకపోతే కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు పుదీనా రసాన్ని కాళ్లకు రాసుకొని తిప్పుకోవడం వల్ల నెమ్మదిగా నొప్పులు సైతం మటుమాయం అవుతాయి.. పుదీనా ఆయిల్ తో నైనా సరే మసాజ్ వంటివి చేయించుకోవడం వల్ల మంచి లాభాలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: