మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలలో కూడా మనకు తెలియని ఎన్నో ఆకుకూరలు అందులో ఉండే పోషకాలను మనం వదిలేస్తూ ఉంటాము.. అలాంటి ఆకుకూరలలో గంగ పాయల ఆకు కూడా ఒకటి.. ఈ ఆకు పేరు వినకపోయినా ఈ ఆకు చెట్టును మాత్రం చూస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అయితే ఈ జాతి మొక్కలలో నాలుగు రకాల మొక్కలు ఉంటాయి ముఖ్యంగా సన్ పాయల, పెద్ద పావిలి, బొడ్డు పాయల, పుల్లపాయల వంటి మొక్కలు ఉన్నవి.. ఇవి ఎక్కువగా పల్లెటూర్లలో పొలాల గట్ల మధ్య కూడా పెరుగుతూ ఉంటాయి.



ఇవి ఎక్కువగా నేల మీద పాకి పోతూ ఉంటాయి ఈ మొక్కలలో ఎక్కువగా నీటి శాతం కనిపిస్తుంది. పసుపు పచ్చని ఆకులు పూలు పూస్తాయి.. పుల్లగా ఉండేటువంటి ఈ ఆకుకూర తో పప్పు చేసుకుంటే తినడానికి రుచిగా ఉన్నప్పటికీ.. ఎన్నో అద్భుతమైన పోషకాలు కలవు. ఈ పోషకాల గురించి తెలుసుకున్న తర్వాత వీటిని అసలు వదిలిపెట్టరు.. ఈ గంగ పాయల ఆకుల విటమిన్..A,B,C,D వంటి వాటితో పాటు మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ,ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా చాలా తక్కువ క్యాలరీలు కలిగిన పీచు పదార్థాలు కూడా ఇందులో ఉంటాయి.


ఎవరైనా బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకుకూరను ఫ్రై చేసుకుని రోజు తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు వ్యర్ధంల కరిగిపోతుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీని వారం మలబద్ధక సమస్యను కూడా తొలగిస్తుంది.


గంగ పాయల ఆకుల ఒమేగా-3 ఆమ్లం ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాలను నాశనం చేయడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు సమస్యను కూడా నివారించేందుకు గంగ పాయల ఆకు బాగా ఉపయోగపడుతుంది. రక్త కణాల సంఖ్యను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆకు కూరను తినడం వల్ల కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: