లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు ఒకరు.. లైఫ్ ఈజ్ షార్ట్ అంటారు ఇంకొకరు. ఈ రెండూ నిజమే..మన జీవితం బుద్భుదప్రాయమని మన పెద్దలు చెబుతారు. కనురెప్ప పాటులో మన జీవితం అంతమైపోవచ్చు. దానికి ఎలాంటి గ్యారంటీ లేదు. కానీ ఉన్నన్నాళ్లూ ఓ తేజంతో బతకాలి.

 

 

అదే మన లక్ష్యం కావాలి. అయితే మొత్తం విశ్వంలో నిత్య నూతనంగా ఉండేది.. ఎల్లప్పుడూ తాజాగా ఉండేది ఒకే ఒక్కటి ఉంది. కానీ మనం దాన్ని గమనించం. దాన్ని గమనించాలంటే ప్రత్యేకమైన సాధన కావాలి. ఇంతకీ అదేంటంటారా.. అదే దివ్యత్వం.

 

 

మరి ఈ దివ్యత్వం ఎలా సాధ్యం.. అసలు మనలాంటి సగటు మనుషులకు దివ్యత్వం సాధ్యమేనా.. అదేదో రుషులు, మునులు వంటి వారికే పరిమితమా.. ఈ సందేహాం సహజమే. కానీ ప్రయత్నిస్తే మనమూ దివ్యత్వాన్ని అందుకోగలం. తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరిస్తూ.. మన దైనందిన కార్యక్రమాలు నెరవేరుస్తూనే..మరోవైపు ఈ దివ్యత్వాన్ని అందుకోవచ్చు.

 

 

అయితే ఇందుకు సాధన అవసరం.. మనం ఏ పని చేస్తున్నా.. ఇదంతా తాత్కాలికమే భావనతోనే చేయగలగాలి. మన లక్ష్యం ఆనందం, దివ్యత్వం అన్న ఎరుక మనసులో ఎప్పుడూ ఉండాలి. అయితే ఇది అంత సులభం కావాలి. దీని సాధన, గురు సాంగత్యం అవసరం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: