పొన్నగంటి కూర.. ఈ ఆకుకూర చాలా మందికి తెలియదు.. పల్లెల్లో ఉండే వారికి ఎక్కువగా తెలుసు..ఈ ఆకుతో వివిధ రకాల కూరలను చేసుకొని తింటారు. వీటి వల్ల ఎన్నో తెలియని ఫలితాలు కూడా ఉన్నాయి. పొన్నగంటి కూరని తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిజంగా జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఇది ఔషధంలా పని చేస్తుంది ఆయుర్వేద ఔషధాల లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. దీన్ని ఇళ్లల్లో చిన్న చిన్న కుండీలలో వేసి పెంచుకుంటే ఎంతో సులువుగా పెరుగుతుంది.



బరువు తగ్గాలనుకునే వారికి ఇది నిజంగా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే తరచు దీన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా మెరుగు పడుతుంది. అంతే కాదండి పొన్నగంటి కూర లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. అధిక రక్తపోటు ను నివారిస్తాయి. జుట్టు ఊడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. చర్మం పై మృతకణాలను తొలగించడం లో ఈ పొన్న గంటి దివ్యౌషధం అని చెప్పాలి.


రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా ఇది సహాయపడుతుంది. పొన్నగంటి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ తగ్గుతుంది. ఎముకల ఎదుగుదలకు కూడా ఇది సహాయ పడుతుంది. దీనిలో కాల్షియం ఆస్టియోపొరోసిస్ వంటి వాటిని కూడా దూరం చేస్తుంది. మూత్రపిండ సమస్యల తో బాధపడే వాళ్ళు వైద్యుల సలహా తోనే తీసుకోవాలి గుర్తుంచుకోండి..ఇవి ఏడాది పొడవునా కూడా లభిస్తాయి. మెగ్నీషియం, కాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ఆకుకూరను కొద్దిగా తీసుకున్న శరీరానికి బోలెడు మేలు ఉందట.. చూసారుగా తక్కువ ధరలో దొరికే ఈ ఆకు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇకమీదట మీరు కూడా పొన్నగంటి కూర ను తినడం అలవాటు చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: