రోజూ ఉదయం పిల్లల స్కూల్, మన పనుల ఒత్తిడితో పాటు లంచ్ బాక్స్ తయారీ ఒక పెద్ద హడావిడిగా మారిపోతుంటుంది. తినేందుకు ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు తయారుచేయాలన్న ఉత్సాహం ఉన్నా... సమయం కొరత వల్ల బిజీగా మారుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొన్ని సాధనలతో, సరళమైన పద్ధతులతో ముందుగానే ప్రణాళిక చేసుకుంటే, హడావిడి లేకుండా ఈ పనిని స్మూత్‌గా చేయవచ్చు. వారానికి ముందు 7 రోజుల లంచ్ ప్లాన్‌ను ఒక పేపర్ లేదా మెమో బుక్‌లో రాసుకోండి.

 రాత్రే పడుకునే ముందు లేదా వీకెండ్‌లో ఫ్రీ టైం లో కూరగాయలు కట్ చేసి డబ్బాల్లో ఫ్రిజ్‌లో పెట్టుకోండి. క్యారెట్, బీన్స్, బీట్‌రూట్, గుమ్మడికాయలు ఇలా రకరకాల కూరగాయల మిశ్రమం రెడీగా ఉంటే ఉడికించేసి అన్నంతో కలిపేయడం సులభం. కొంతమంది ప్రీ-కుక్ చేసిన దాల్స్ లేదా వెజిటబుల్ పేస్ట్‌లు కూడా తయారు చేసుకుని స్టోర్ చేస్తారు. ఇడ్లీ లేదా దోసె పిండిని ముందు రోజు రాత్రే సిద్ధం చేయండి. చపాతీ పిండి ముందుగానే కలిపి, ఫ్రిజ్‌లో పెట్టండి. కొన్నిసార్లు ఉడికించిన బియ్యం రాత్రే ఉంచితే ఉదయాన్నే తక్కువ టైమ్‌లో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. బియ్యం కుక్కర్‌లో ఉడికుతున్న సమయంలో పక్కనే కూర తయారీ మొదలుపెట్టండి. ఒక స్టౌవ్ మీద భాజీ వేస్తే, మరొకటి మీద పచ్చడి, సాంబారు, లేదా చపాతీలు వేసేయండి. ఇవి ముందు రోజు లో తయారు చేసి పెట్టుకుంటే హడావిడి తగ్గుతుంది.

టమాటా గ్రేవీ పేస్ట్, శనగపప్పు పచ్చడి, సాంబార్ మసాలా,కొబ్బరి కారం మిశ్రమం, మింట్/కోతిమీర చట్నీ పేస్ట్, చిన్న చిన్న డబ్బాల్లో కట్ చేసిన కూరగాయలు, కాయగూరల మిశ్రమాలు ఉంచుకోండి. గిన్నెలు/కంటైనర్లు క్లియర్‌గా లేబుల్ చేసి ఉంచితే ఎక్కడ ఏది ఉందో వెంటనే అర్థమవుతుంది. ఒక 15 నిమిషాలు ముందే నిద్రలేచితే మొత్తం రష్ తగ్గుతుంది. పనుల్లో హడావిడి కాకుండా, సాంత్వనగా చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల ఫేవరెట్ లంచ్ ఐటెంలు ముందుగానే తెలుసుకుని వారానికోసారి చేయండి. ముందుగానే చెప్పిస్తే మీరు సిద్ధంగా ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: