ఒకప్పుడు అంటే యోగా అన్న పదమే ఎక్కువ మందికి తెలిసేది కాదు . కానీ ఇప్పుడు మాత్రం యోగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక దైవంలా భావిస్తున్నారు . ఎన్నో జబ్బులకి యోగా ఒక మందులా తయారైంది . ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రానే వచ్చేసింది . ప్రపంచ దేశాలు యోగ జరుపుకునేందుకు సిద్ధమైపోయారు.  యోగాకు మతం లేదు కులం లేదు.  అందరికీ ఒకటే . ఆరోగ్యశాస్త్రం యోగ . అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా జరుపుకుంటారు . ఈ సంవత్సరం ప్రపంచం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతుంది . ఈ రోజున సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు యోగ కార్యక్రమంలో పాల్గొంటారు.


మరి ముఖ్యంగా కొన్ని స్కూల్స్ కూడా ఈ రోజు ప్రత్యేకంగా యోగ క్లాసులను తీసుకుంటుంది . కాగా  నరేంద్ర మోడీ సెప్టెంబర్ 27 - 2014 ఐక్యరాజసమితి సర్వసభ్య సమావేశంలో తన ప్రసంగంలో ప్రతిపాదించారు . కాగా చాలా మంది యోగా అంటే ఆసనాలు అని మాత్రమే అనుకుంటారు . కానీ కానే కాదు . యోగాలో ముద్రలు కూడా ఉంటాయి.  ఆ యోగ ముద్రలు శరీరంలోని ప్రాణశక్తిని నియంత్రించేందుకు శక్తివంతమైన సాధన అని చెప్పుకోవాలి . వేళ్ల ముద్ర.. భంగిమ.. శ్వాస నియంత్రణ వంటి అంశాల ద్వారా మన శరీర మనసు ప్రాణశక్తిలను సమన్వయం చేస్తాయి .



 అసలు యోగ ముద్రలు అంటే ఏంటి..??

ముద్ర అనే పదానికి సీల్ లేదా శక్తిని ముద్రించడం అని అర్థం గా చెప్పొచ్చు . యోగ ప్రాణమాయం ప్రాణయామం.. ధ్యానం వంటి సాధనలో ముద్రలు ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే . వీటికి శరీరంలో మీ శక్తి ప్రవాహాన్ని ఒక నిర్దిష్ట దిశలోకి మళ్లించగలిగే శక్తి ఉంటుంది.  ఆకాశముద్ర - అగ్ని లేదా సూర్య ముద్ర -  జలముద్ర - శూన్య ముద్ర - హృదయముద్ర ఇలా ఎన్నెన్నో ముద్రలు ఉన్నాయి.  ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క స్పెషాలిటీ కొన్ని ముద్రలు అసలు మందు లేకుండానే జబ్బులు నయం చేసే శక్తి కూడా ఉంటుంది .



రోజులో కనీసం 15 నుంచి 30 నిమిషాలు ముద్రను అభ్యసించాలి.  ఆ తర్వాత ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి భోజన అనంతరం కూడా చేయొచ్చు.  ధ్యానం లేదా ప్రాణయామం సమయంలో ముద్రలతో కలిపి చేస్తే ఇంకా ఇంకా మంచి ఫలితం ఉంటుంది.  మరీ ముఖ్యంగా మంచి ఫలితం కోసం క్రమం తప్పకుండా నిరంతరం ఒకే ముద్రను కనీసం 21 రోజులు చేయాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే వ్యాయామం చేయడానికి సమయం ఉండదో.. ఆఫీసులకు పరుగు పరుగున వెళ్లాలి అన్న బిజీ షెడ్యూల్ ఉంటుందో అలాంటి వాళ్ళు రోజుకు కనీసం 20 నిమిషాలైనా సరే లేకపోతే పది నిమిషాలు అయినా సరే ఇలా ముద్రలు వేయడం ద్వారా మంచి ఫలితాన్ని అందుకుంటారు . మరి ముఖ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు అగ్ని ముద్ర - ఆకాశముద్ర వంటివి వేయడం ద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు యోగా నిపుణులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: