
మన శరీర ఎత్తు ఎంత ఉందో ..? బరువు కూడా అంతే ఆధారంగా ఉండాలి. ఇది 25 లో ఉండటం మంచిది . 25 నుంచి 29.6 మధ్యలో ఉంటే అధిక బరువుగా.. 30 అంతకన్న ఎక్కువగా ఉంటే ఒబిసిటి గా పరిగణిస్తారు . బరువును లెక్కించడానికి బిఎమై తేలికైన సత్వర మార్గం. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా ఓవర్ వెయిట్ కారణంగా బాధపడిపోతున్నారు . తద్వారా డయాబెటిస్.. థైరాయిడ్ .. హార్మోనల్ ఇం బాలన్స్ ..పిసిఒడి.. పి సి ఓ ఎస్ అంటూ రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు . మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఒక వయసు వచ్చాక పీసీఓడీ , పీసీఓఎస్ సమస్యలతో బాధపడిపోతున్నారు. దీన్నంతటికి కారణం ఎక్కువగా బరువు పెరగడం . అయితే బరువు ఈజీగా తగ్గొచ్చు పెద్ద కష్టమేమి కాదు . మనకు నచ్చిన ఫుడ్ మనం తింటూనే ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు డాక్టర్లు. కేవలం మీరు చేయాల్సిందే రెండే రెండు. తినే ముందు ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి .
అదే విధంగా తిన్న ఫుడ్ ని ఎంత కరిగిస్తున్నాం అనే విధంగా వ్యాయామం ఈ రెండు చేస్తే కచ్చితంగా బరువు ఎవరైనా తగ్గుతారు అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఇడ్లీ - దోసె - పూరీ - చట్నీ - ఉప్మా కాకుండా స్ప్రౌట్స్ తీసుకోవడం మంచిది అంటూ సూచిస్తున్నారు. అంతేకాదు మధ్యాహ్నం వైట్ రైస్ .. చాలా తక్కువ క్వాలిటీలో తీసుకోవడం ఎక్కువగా ఆకుకూరలు.. ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఆకలి తీరుతుంది . బాడీకి తగిన పోషకాలు లభిస్తాయి అంటున్నారు . రాత్రిపూట పూర్తిగా అన్నం మానేయకుండా రెండు చపాతి ఎక్కువ కూరలు తీసుకోవడం మరింత ఉత్తమని .. ఆరు లోపే డిన్నర్ ఫినిష్ చేసేస్తే తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం ఉంటుంది అని.. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఇన్ఫెక్షన్స్ పోతాయి అని చెప్తున్నారు .
మనకి నచ్చిన ఫుడ్ మనం పీకలు దాక తినేయకుండా లిమిట్ గా పోషన్ కంట్రోల్లో తినడం వల్ల కూడా బరువు ఈజీగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. కడుపునిండా తినేసి పనిచేయకుండా బద్దకంగా అలాగే కూర్చుంటే ఖచ్చితంగా బరువు పెరిగిపోతారు . కొంచెం తిని కొంచెం వర్క్ చేస్తే హెల్తీ ఆరోగ్యం మన సొంతం అంటూ డాక్టర్ చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరు కంప్యూటర్ ల ముందు గంటలు గంటలు తరబడి అలానే కూర్చొనేస్తున్నారు. ఇంట్లో చేసుకునే ఓపికలకు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి మళ్ళీ అక్కడే కూర్చుంటున్నారు . తద్వారా బరువు పెరిగిపోతుంది . తద్వారా బరువు పెరగడమే తప్పిస్తే తగ్గే ఛాన్సెస్ ఉండదు. 20 నిమిషాలకు ఒకసారి అటు ఇటు లేచి తిరుగుతూ నీళ్లు తాగుతూ మళ్ళీ కూర్చొని తమ వర్క్ చేసుకుంటూ లిమిటెడ్ పొర్షన్స్ ఆహారం తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గొచ్చు అంటున్నారు..!