ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య స్పృహ పెరిగిన తరువాత చాలామంది రాగి సీసాల్లో నీరు తాగడం మొదలుపెట్టారు. పూర్వకాలం నుండి మన పెద్దలు రాగి పాత్రలలో నీరు నిల్వచేసి తాగేవారు. ఆయుర్వేదం ప్రకారం, రాగి పాత్రలో నిల్వ చేసిన నీటికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ రాగి సీసాలు వాడేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే, ప్రయోజనాలకు బదులుగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయాలను గమనించాలి.

రాగి సీసాలో నీటిని ఎక్కువ సమయం నిల్వ ఉంచడం మంచిది కాదు. 8 గంటల నుండి 12 గంటల వరకు ఉంచితే చాలు. అంతకంటే ఎక్కువ సమయం ఉంచితే రాగి ఆక్సీకరణ చెంది (Oxidation) కొన్ని రసాయన పదార్థాలు నీటిలో చేరే అవకాశం ఉంటుంది. : రాగి పాత్రలను తరచుగా శుభ్రం చేయకపోతే, లోపల గ్రీన్ కలర్లో ఆక్సైడ్ పొర (Patina) ఏర్పడుతుంది. ఈ పొర ఆరోగ్యానికి హానికరం. అందువల్ల ప్రతిరోజూ సీసాను శుభ్రం చేయాలి. నిమ్మకాయ, ఉప్పు కలిపి సీసా లోపల శుభ్రం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

రాగి సీసాలో వేడి నీరు పోసి తాగడం అస్సలు మంచిది కాదు. వేడి వల్ల రాగి ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమై, హానికరమైన పదార్థాలు నీటిలో కలుస్తాయి. అందుకే సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటిని మాత్రమే తాగాలి. నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ లాంటి పుల్లని ద్రవాలను రాగి సీసాలో తాగకూడదు. ఈ రకమైన పదార్థాలు రాగితో చర్య జరిపి అనారోగ్యానికి దారితీయవచ్చు.

రాగి సీసాను నేరుగా నేలపై పెట్టకూడదు. ఇది రాగి యొక్క పవిత్రతకు భంగం కలిగిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఎల్లప్పుడూ ఒక పీట లేదా గుడ్డపై సీసాను ఉంచడం మంచిది.: రాగి సీసాలో నీరు ఎక్కువ మోతాదులో తాగకూడదు. రోజుకు ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల నీరు మాత్రమే తాగడం మంచిది. అతిగా తాగితే శరీరంలో రాగి శాతం పెరిగి వాంతులు, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావచ్చు. రాత్రి పడుకునే ముందు రాగి సీసాలో నీరు పోసి, ఉదయం లేవగానే తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ఆయుర్వేదంలో 'తమ్ర జల్' అని అంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: