టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో
నితిన్ కూడా ఒకడు. కొంత కాలం ప్లాపులతో తిప్పలు పడిన ఈ హీరో.. ఇష్క్ సినిమాతో తన సత్తా చాటాడు. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. గతేడాది
నితిన్,
రష్మిక జంటగా వచ్చిన ‘భీష్మ’
మూవీ అతని కెరీర్ లోనే బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదే ఊపులో ప్రస్తుతం
నితిన్ ‘చెక్’ అనే
సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో
నితిన్ ఖైదీగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అవుతోంది. అయితే ఇటీవల
నితిన్ ‘చెక్’
సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందిట. గత ఏడాది ‘భీష్మ’ సినిమాతో
నితిన్ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ
సినిమా గతేడాది
ఫిబ్రవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టింది. అయితే ఈ సారి కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ చేయాలని
నితిన్ చూస్తున్నాడట.
అందుకే ఇప్పుడు
చెక్ సినిమాను కూడా
ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయాలని
నితిన్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ఈ
సినిమా వచ్చే నెల 19వ తేదీన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోందట. ఈ సినిమాను క్రియేటివ్
డైరెక్టర్ చంద్ర
శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అంతే కాకుండా ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్
జోనర్ లో రూపొందుతోంది. ఈ సినిమాలో
నితిన్ సరసన
టాలీవుడ్ హాట్
బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, మలయాళీ
భామ ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను
నితిన్ అందుకుంటాడా? లేదా? అని చూడాలి.
నితిన్ సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అవుతుందోమే తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.