
ఇలా జరగాల్సింది మొత్తం జరిగిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి.. అయ్యో పాపం అంటూ కాస్త జాలి పడటం తప్ప. ఇక్కడ ఓ నటి విషయంలో ఇలాంటిదే జరిగింది.. ఇంతకీ ఆ నటి ఎవరు ఏ సినిమాలో నటించింది ఏ సీరియల్ లో నటించింది అనుకుంటున్నారా.. అంతలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి.. ఆమె టిక్ టాక్ లో వీడియోలు చేసి తనకు తాను గొప్ప నటి అని ఫీల్ అవుతూ ఉంటుంది. అంతే కదా మరి నేటి రోజుల్లో టిక్ టాక్ చేసే వాళ్ళ అందరి భావనా కూడా అదే. ఇక ఇప్పుడు అదంతా ఎందుకు లెండి.. మన.. మేటర్ లోకి వెళ్తే.. ఎప్పుడు టిక్ టాక్ వీడియోలు చేస్తూ బాగానే ఫేమస్ అయింది ఆ యువతి.
చూడ్డానికి అందంగానే ఉంటుంది.. ఇంకాస్త అందంగా తయారవ్వాలని అనుకుంది.. అలా అనుకున్న వారందరికీ మొదటి ఆప్షన్ సర్జరీ. ఇక పాకిస్థాన్కు చెందిన టిక్ టాక్ స్టార్ హరిమ్ షా కూడా సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇక లండన్ కి వెళ్లి ఎంతో ఖరీదైన పిల్లర్ ట్రీట్మెంట్ కూడా ప్రారంభించింది. ఏం చేస్తాం అంతలో ఆర్థిక ఆరోపణలు రావడంతో బ్యాంకు ఖాతాలను పాకిస్తాన్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో డబ్బు లేకపోవడంతో సర్జరీ మధ్యలోనే ఆగిపోయింది. పర్లేదులే సగం సర్జరీ అయింది కదా అనుకుంది ఆ యువతి. కానీ తీరా చూస్తే పెదాలు ఉబ్బిపోయి జారి పోయినట్లుగా మారిపోయాయ్. ఇలా మరింత అందం కోసం చూస్తే ఉన్న అందం కూడా పోగొట్టుకొని బాధపడుతుంది ఆ యువతి.