సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే సామ్ తనకు మయోసైటీస్ అనే వ్యాధి ఉందని వెల్లడించిందో.. అప్పటినుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తుంది. ఇక అప్పటినుంచి అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు, సన్నిహితులు అందరూ కూడా సమంత మయోసైటిస్ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఇటీవల యశోద ప్రమోషన్స్ లో తన పర్సనల్ లైఫ్ గురించి తన ప్రాబ్లమ్స్ గురించి చెబుతూ సమంత ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతానికి ఆమె చికిత్స తీసుకుంటున్నారు. సమంత నటించిన యశోద సినిమా థియేటర్స్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.

ఇక కొద్ది రోజులుగా సమంత విశ్రాంతి తీసుకుంటుంది. ప్రస్తుతం ఎటువంటి సినిమా షూటింగ్స్ కి అటెండ్ అవ్వని సమంత తాజాగా 'శాకుంతలం' సినిమా డబ్బింగ్ స్టార్ట్ చేసింది. అందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీన్ని బట్టి సమంతకి సినిమా అంటే ఎంత ఫ్యాషన్ అనేది అర్థమవుతుంది. తాజాగా శాకుంతలం సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఓ స్క్రీన్ ఇమేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సమంత. ఆ పోస్టులో సామ్ పేర్కొంటూ.. "బాధకైనా, ముఖ్యమైనవి కోల్పోయినప్పుడైనా, ఒంటరిగా ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ట్ క్యూర్ లాంటిది" అంటూ నిక్కీ రోవ్ లైన్స్ జత చేసింది. దీంతో సమంత పెట్టిన ఈ స్క్రీన్ షాట్ తో పాటు ఆమె పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.

అనారోగ్యంతో ఉండి కూడా సమంత షాకుంతలం సినిమా డబ్బింగ్ స్టార్ట్ చేయడం పట్ల నెటిజన్లు, అభిమానులు సమంత డెడికేషన్ కి ఫిదా అవుతూ..  ఆమెను కొనియాడుతున్నారు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో భారీ పీరియాడికల్ డ్రామాగా 'శాకుంతలం' సినిమా తెరకెక్కింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాతోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. గుణ టీం వర్క్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: