ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు వరుస పెట్టి మళ్లీ మళ్లీ విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అయితే గతంలో వచ్చిన సినిమాల కంటే కాస్త అప్గ్రేడ్ చేసి క్వాలిటీతో తీసుకొస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే హీరోల బర్తడేలు.. స్పెషల్ రోజుల్లో వీటిని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఇకపోతే అభిమానుల సైతం తమ హీరోల పాత సినిమాలను మళ్లీ థియేటర్ స్క్రీన్ పై చూడాలి అని తెగ ఆసక్తి చూపిస్తున్నారు . ప్రస్తుతం ఇటీవల కాలంలో 4k వెర్షన్ లో అప్డేట్ చేసి ఈ సినిమాలను థియేటర్లలో వదులుతున్నారు.


ఇప్పటికే మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ హవా.. ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ లాంటి తదితరుల సినిమాలు రీ రిలీజ్ చేసి మంచి సక్సెస్ పొందారు.  ముఖ్యంగా రీ రిలీజ్లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు బిజినెస్ కూడా జరుగుతోంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినీ కెరియర్ లో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది.  ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో సింగమలై అంటూ వచ్చే డైలాగ్ ఆ సమయంలో అభిమానులకు పూనకాలు తెప్పించేది.  ఇప్పుడు మరోసారి విడుదల అవుతుండడంతో ఈ సినిమాపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సింహాద్రి సినిమాలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇకపోతే ఈ సినిమా 2003 జూలై 9న విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా అదిరిపోయే కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఇందులో అంకిత,  భూమిక హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ 4కే వెర్షన్లో థియేటర్లలో రావడానికి సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: