తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించిన నాగ శౌర్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన పలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ ని మార్చి 17 వ తేదీన ధియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇది ఇలా ఉంటే ఇది వరకే నాగ శౌర్య ... అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ఊహలు గుసగుసలాడే ... జ్యో అచ్యుతానంద మూవీ లు తెరకెక్కి ఈ రెండు మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అలా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన రెండు మూవీ లు మంచి విజయాలను అందుకోవడంతో తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన పలనా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: