కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త తెలిపారు. ముఖ్యంగా ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసే సమయంలో పడే చార్జీలపై ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఖాతాదారులు నెలకు.. వారి సొంత బ్యాంక్ ఎటిఎం ల నుంచి ఐదు సార్లు.. ఇతర బ్యాంకులకు సంబంధించి ఏటీఎంలో నుంచి మరో ఐదు సార్లు ఉచితంగా నగదును విత్డ్రా చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఖాతాదారులు నెలకు 10 ట్రాన్సాక్షన్లను ఏటీఎంల  ద్వారా నిర్వహించుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఈ విషయాన్ని మంత్రి రాజ్యసభలో ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకుల నుంచి నగదును ఉపసంహరించే సమయంలో ఎలాంటి జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు.


అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్విట్టర్ వేదికగా బాగా వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా రాజ్యసభలో ఆర్థిక శాఖ మంత్రి ఇలా ఏటీఎం ట్రాన్సాక్షన్లపై తెలిపిన అన్ని వివరాలను మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఇకపోతే బ్యాంకుల నుంచి కాష్ విత్ డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ కట్టవలసిన అవసరం లేదు అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా స్పష్టం చేశారు. అయితే చెక్కుబుక్కులపై మాత్రం పన్నులు కచ్చితంగా విధిస్తారనే వార్తలపై  సైతం ఆమె స్పష్టం చేశారు .ముఖ్యంగా ప్రింటర్ నుంచి బ్యాంకులు కొనుగోలు చేసే చెక్ బుక్ లపై జిఎస్టి ఉంటుందని స్పష్టం చేశారు కానీ వినియోగదారుల చెక్ బుక్ ల పై మాత్రం ఎటువంటి పన్నులు ఉండదు అని మంత్రి వెల్లడించడం జరిగింది.

అంతేకాదు ప్యాక్ చేసి లేబుల్ వేసే ఫుడ్ ఐటమ్స్ పై కూడా ఐదు శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్లోని అన్ని రాష్ట్రాలు కూడా అంగీకరించాయి అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: