
ఇకపోతే ఝార్ఖండ్ లోని ఖుంతీలో బిర్సా కాలేజీ వేదికగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ నగదు జమ చేయనున్నారు. మొత్తం రూ.18,000 వేల కోట్లను ప్రధాని మోదీ విడుదల చేయగా, నేడు రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ అధికారులు తాజాగా తెలిపారు. మరోవైపు దేశ వ్యాప్తంగా రూ.8 కోట్లకు పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా 6000 రూపాయలు అందిస్తుంది. ఎరువులు కొనుగోలుకు, వ్యవసాయానికి సంబంధించి ఆర్థిక సాయం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
అందులో భాగంగా ఈ ఏడాది జూలైలో పీఎం కిసాన్ 14 వ విడత నిధులను కేంద్రం రైతుల ఖాతా లో జమ చేసింది. ఇప్పుడు 15 వ విడత నగదును నవంబర్ 15న (బుధవారం) విడుదల చేసి రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేయనున్నారు ప్రధాని మోదీ. ఇకపోతే ఝార్ఖండ్, కుంతీలోని బిర్సా వర్సిటీలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాలు (KVK) , రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలు, ఏసీఏఆర్ ఇన్స్టిట్యూట్లు, పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సాధారణ సేవా కేంద్రాలు ద్వారా ప్రసారం చేయనున్నారు.