ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రజలు ఎక్కువగా ఆరోగ్యం పైన చాలా కేర్ తీసుకుంటున్నారు.. కల్తీ పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా ఎక్కువగా నాచురల్ వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిని వ్యాపార హస్తంగా మార్చుకుంటే మంచి లాభాలను సైతం పొందుకోవచ్చు.. ఇలాంటి వాటిలో గానుగ నూనె బిజినెస్ కూడా ఒకటి.. పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా ఈ బిజినెస్ ఎక్కడైనా జరుగుతుంది. దీంతో భారీగానే లాభాలను సైతం అర్జించవచ్చు. చిన్న చిన్న మిషన్లతో ఇంటి వద్దనే ఈ వ్యాపారాన్ని సైతం ఎవరైనా ప్రారంభించుకోవచ్చు.


కేవలం తక్కువ పెట్టుబడితో నెలకు లక్షకు పైగా ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు.. ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలంటే.. ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ మిషన్ కచ్చితంగా అవసరం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన గది ఉండాలి మిషన్ ధర విషయానికి వస్తే కెపాసిటీని బట్టి 15 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ నుంచి లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి. మీరు తయారు చేసేటువంటి నూనెను ప్యాకెట్ లేదా సీసాలలో ప్యాక్ చేసి నేరుగా అమ్ముకోవచ్చు.


అయితే మీరు తయారు చేసినటువంటి నూనెను మార్కెట్లో లీటర్ కి రూ .80 రూపాయలు చొప్పున సేల్ చేసుకుంటే.. రోజుకి 35  లీటర్లు నూనెను తయారుచేసిన  రూ .2800 రూపాయలు చొప్పున పొందవచ్చు ఈ లెక్కన వేసుకుంటే రూ .84,000 రూపాయలను సైతం సంపాదించుకోవచ్చు ఒకవేళ మరింత ఎక్కువ నూనెను సైతం ఉత్పత్తి చేయగలిగితే మరింత లాభాన్ని కూడా అందుకోవచ్చు.. నూనె తర్వాత తీసిన ఆ పిప్పిని కూడా పశువుల దానాగా అమ్మేస్తే దీని వల్ల కూడా మంచి లాభాలను పొందవచ్చు.. గానుగ వంటి వాటిలో ఎలాంటిది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది .దీనివల్ల మంచి లాభాలను కూడా మనం అందుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: