సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీని పెడతానని ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన చేయడం  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సమస్యగా మారి కొందరు పవన్ వ్యతిరేకులు పవన్ ను టార్గెట్ చేసే విధంగా పరిస్థితులు మారడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోని కొందరు రజనీకాంత్ ప్రకటనలోని కొన్ని కీలక విషయాలను పవన్ కళ్యాణ్    ‘జనసేన’ విధానాలతో పోలుస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఈమధ్య కాలంలో పవన్ ను టార్గెట్ చేయడమే ఒకపనిగా పెట్టుకున్న సినిమా విమర్శకుడు  మహేష్ కత్తి తన ఫేస్‌ బుక్‌ లో రజనీకాంత్ ప్రకటనను పవన్ రాజకీయ జీవితంతో పోలుస్తూ ఒక షాకింగ్ కామెంట్ చేసాడు "పార్టీ పెట్టి పోటీ చెయ్యకుండా ఇంట్లో కూర్చుంటే 'పిరికిపంద' అంటారు" అని రజనీకాంత్ తన ఉపన్యాసంలో అన్నమాటలను ఉదహ రిస్తూ ‘అరె మా స్టేట్ లో పవన్ కళ్యాణ్ అంటామే' అంటూ కామెంట్ చేసాడు. దీనితో మరోసారి కత్తి మహేష్ కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాని తెప్పిస్తున్నాయి.

 

ఇది చాలదు అన్నట్లుగా రజనీకాంత్  ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా మరో కామెంట్ పెట్టి మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రసంగం పవన్ కు లేనిపోనీ తలనొప్పులు తెచ్చి పెట్టింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదిన్నార సమయం ఉంది కాబాట్టి ఈలోగా పవన్ ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్ వచ్చాక మరో సినిమాను చేసే ఆలోచనలు పూర్తిస్థాయిలో ఊపు అందుకున్నట్లు వార్తలు వస్తూ ఉండటంతో పవన్ కు రాజకీయాల పై ఉన్న కమిట్ మెంట్ పై మరిన్ని ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

 

దీనికితోడు నిన్న రజనీకాంత్ చేసిన ఉపన్యాసంలోని విషయాలను పవన్ రాజకీయ ఉపన్యాసలాతో పోలుస్తూ రజనీ ఉపన్యాసంలో లోతైన రాజకీయ ఎత్తుగడలు ఉంటే పవన్ రాజకీయ ఉపన్యాసంలో కేవలం ఆవేశం మాత్రమే కనిపిస్తుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా రజనీకాంత్ రాజకీయ ప్రకటనతో పవన్ తన రాజకీయ వ్యూహాలు మార్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు..











మరింత సమాచారం తెలుసుకోండి: