
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు హైపర్ ఆది. ఒక రకంగా చెప్పాలంటే గురువారం వస్తూందీ అంటే..హైపర్ ఆది స్కిట్ కోసం ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బుల్లితెరపై చేస్తున్న ఆది..ఇప్పటికే వెండితెరపై కూడా కాలు పెట్టాడు. తర్వలో వెండి తెరపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. స్వతహాగా రచయిత అయిన ఆది తన స్కిట్స్ తానే రాసుకొని పంచ్ డైలాగ్స్ తో అదరగొడుతుంటాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాన్ కి యుద్దం అవుతున్న విషయం తెలిసిందే. ఆ మద్య హైపర్ ఆదితో కూడా కత్తి ఓ విషయంలో గొడవ పడ్డారు. అయితే పవన్ అంటే తాను ఎంతో అభిమానిస్తానని..ఆయన వెంటే ఉంటామని హైపర్ ఆది పలుమార్లు అన్న విషయం తెలిసిందే. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదలైంది.

సినిమా ఫలితానికి సంబంధించి మిశ్రమ స్పందన వస్తుంది. పవన్ను ఇన్నాళ్లూ తీవ్రంగా వ్యతిరేకించిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ దారుణమైన సినిమా అంటూ విమర్శించారు. ఈ సినిమాపై హైపర్ ఆది మాత్రం సినిమా అద్భుతంగా ఉందంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. తమ్ముడు, తొలిప్రేమ వంటి సినిమాల్లో పవన్ కల్యాణ్ కామెడీ టైమింగ్తో ఎలా అలరించాడో, మళ్లీ ఈ సినిమాలో కూడా అదే తరహాలో తనదైన శైలిలో పవన్ వినోదాన్ని పంచాడని హైపర్ ఆది చెప్పాడు.

ఈ సినిమాలో రాజ్యం మీద ఆశ లేనోడి కంటే గొప్ప రాజు ఎవడుంటాడని ఓ డైలాగ్ ఉందని, నిజజీవితంలో కూడా పవన్ అలాంటి వ్యక్తేనని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.ఈ సినిమాను పదిసార్లు చూడొచ్చని, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు చూడొచ్చని, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, మురళీ శర్మ.. వీళ్లందరి కోసమైతే వీలున్నప్పుడల్లా చూడొచ్చని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా బ్లాక్బస్టర్ అని చెప్పొచ్చని ఆది అనడం విశేషం.
మరింత సమాచారం తెలుసుకోండి:
hyper adhi
agnatavasi movie
about
review
ap politics
telangana politics
ap political updates
telugu political news
latest news
latest ap updates
political news
indian politics
international news
national news
tollywood news
bollywood news
kollywood news
hollywood news
tollywood
latest film news
latest updates