ప్రేమించి పెళ్ళి చేసుకున్న కరీనాను, సైఫ్ మొదటిసారిగా కొపగించుకున్నాడు. కారణం మాత్రం చిన్నదైన కరీనా చిన్నబోయింది. కరీనా ఏ పాత్ర చేసినా అందులోకి లీనమైపోయి, ఆ పాత్ర పై రీసెర్చ్ చేస్తుంది. ఛాలెంజింగ్ రోల్స్ చేసేటప్పుడు ఎంతో గ్రౌండ్ వర్క్‌ను ప్రిపేర్ చేసుకుంటుందట కరీనా. ఈ విషయాన్ని బాలీవుడ్‌లో ఏ డైరెక్టర్‌ని అడిగినా కరీనా గురించి చెప్పే మాట. రీసెంట్‌గా కరీనా నటించిన సత్యాగ్రహ మూవీ కోసం ఎంతో హార్డ్ వర్క్‌ను చేసిందట. ఎంతగా అంటే మొగుడు సైఫ్‌ను పట్టించుకోకుండా జర్నలిజంపై రీసెర్చ్ వర్ చేసి రాత్రిళ్ళు కూడ సరిగా నిద్రపోయేది కాదంట.
కరీనా పరిస్థితిను చూసిన సైఫ్, ఇటువంటి యాటిట్యూడ్ మంచిది కాదు. ఎందుకంటే నేనూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేశాను. మూవీకు ఎంత వరకు అవసరమో అంతే నేర్చుకోవాలి. దాన్నే పట్టుకొని పర్సనల్ లైఫ్‌ను మిస్ చేసుకోవడం మంచిది కాదు. అని చిన్నపాటి వార్నింగ్‌ను ఇచ్చాడు. పెళ్ళి తరువాత కరీనాకు మొదటిసారి సైఫ్ ఇంత సీరియస్‌గా చెప్పటం ఇదే మొదటిసారి అని బాలీవుడ్ అంటోంది. అయితే సత్యాగ్రహ దర్శకుడు ప్రకాష్‌ఝూ మాత్రం కరీనా లాంటి వర్క్ డేడికెట్ యాక్టర్‌ను బాలీవుడ్ ఇంత వరకూ చూడలేదని తెగ పొగుడుతున్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: