తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, కార్తి సుబ్బరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘పెట్టా’ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ కి అభిమానులు వున్నారు.  రజినీకాంత్ నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే.. పండుగలన్నీ ఒక్కసారిగా వచ్చేసిన సందడి కనిపిస్తుంది. తమిళనాట  ఈ సినిమా రిలీజ్ సమయంలోనే తమిళ నాట అజిత్ నటించిన ‘విశ్వాసం’కూడా రిలీజ్ అయ్యింది.  ఇద్దరూ టాప్ హీరొలు కావడంతో కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని అందరూ అనుకున్నారు. 
Image result for rajini telugu  petta
సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగు లో ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్ 2 మూవీలు రిలీజ్ అయిన సమయంలోనే ‘పేట’ కూడా రిలీజ్ అయ్యింది.  తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా..తమిళ నాట మాత్రం హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, వారం రోజుల్లో 150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో రజనీకాంత్ కి దక్కిన అసలు సిసలు హిట్ ఇదేననే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.   
Image result for rajini telugu  petta
గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో తర్వాత రజినీకాంత్ కి ఏ సినిమా కలిసి రాలేదు.  మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 2.0 బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  ఆ తర్వాత వచ్చిన పెట్టా కూడా మంచి వసూళ్లు రాబడుతుంది.  ఈ సినిమాలో రజనీకాంత్ యంగ్ గా, స్టైలీష్ గా కనిపించడం, మాస్ కంటెంట్ పుష్కలంగా ఉండటం, ఆడియో సక్సెస్ కావడం ఈ సినిమాకి ఈ స్థాయి విజయం దక్కడంలో ప్రధానమైన పాత్రను పోషించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: